Bithiri Sathi : హీరోలను ఇంటర్వ్యూ చేయడానికి బిత్తిరి సత్తి అంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడా?
Bithiri Sathi : బిత్తిరి సత్తి..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనకంటూ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకొని తనదైన మాటలతో తెగ అలరిస్తున్నాడు. మీడియా న్యూస్ ఛానల్ లో సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులకు దగ్గరైన అతను ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ప్రస్తుతం అతను కొత్త దారిలో ఆదాయాన్ని భారీ స్థాయిలో అందుకుంటున్నాడు. పెద్ద దర్శకులు హీరోలు కూడా ప్రస్తుతం బిత్తిరి సత్తి తో సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు . సుమ కన్నా కూడా అతను ఎక్కువ ఆదాయం అందుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో కాస్త క్లిక్ అయినా కూడా ఊహించని స్థాయిలో ఆదాయం లభిస్తూ ఉంటుంది. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన బిత్తిరి సత్తి ఏ విధంగా క్లిక్కయ్యాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బిత్తిరి సత్తి అనగానే అందరికీ కూడా తీన్మార్ వార్తలు గుర్తొస్తూ ఉంటాయి అప్పట్లో కేవలం బిత్తిరి సత్తి కోసమే ఆ వార్తలు ఎక్కువగా చూసేవారు. అతను తన బాడీ లాంగ్వేజ్తో సరదా యాసతో అన్ని వర్గాల వారికి దగ్గరయ్యాడు. ముఖ్యంగా గ్రామాల్లో కూడా అతనికి మంచి క్రేజ్ దక్కింది. దీంతో అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. అతని అసలు పేరు రవికుమార్. చేవెళ్ళ ప్రాంతంకు చెందిన అలా సాదారణ రైతు కుటుంబంలో జన్మించాడు.బిత్తిరి సత్తి మల్టీ టాలెంటెడ్. అతను పాడిన కొన్ని పాటలు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకున్నాయి.
![bithiri sathi remuneration Big News now](https://thetelugunews.com/wp-content/uploads/2022/07/Bithiri-Sathi.jpg)
bithiri sathi remuneration Big News now
Bithiri Sathi : సత్తి సంపాదన మాములుగా లేదు..
మిమిక్రి కూడా అద్భుతంగా చేయగలడు.పూల పూల చొక్కా ధరించి పొట్టి లాగులో కనిపించే సత్తి ఎలాంటి స్టార్ హీరోకి అయిన తెగ నవ్వు తెప్పిస్తాడు. ప్రస్తుతం నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది..ఇప్పుడు బిత్తిరి సత్తి ప్రైవేట్ యాడ్స్ కూడా చేస్తున్నాడు. దీని కోసం కూడా అతను ఒక రోజుకు ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు అయితే వినిపించింది. ఇక ఇంటర్వ్యూలకు బిత్తిరి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. ఒక్కో ఇంటర్వ్యూకు బిత్తిరి సత్తి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సత్తి ప్రతి సినిమా ఇంటర్వ్యూకు కూడా మంచి క్రేజ్ అందుతుంది.అందుకే హీరోలు కూడా ఆయనకి ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.