Akhanda Movie : బాలయ్య అఖండపై ఇప్పుడేం మాట్లాడనంటున్న బోయపాటి.. అసలేమైంది..?
Akhanda Movie :నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త మూవీ ‘అఖండ’ గురించి ఎవ్వరు ఏం అడిగినా తాను ఇప్పుడు మాట్లాడనని దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించారు. తాను తెరకెక్కించిన సినిమా గురించి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు బోయపాటి కామెంట్స్ పై కొంత ఆందోళనకు గురయ్యారట.. ఒకవేళ సినిమా గురించి ముందే నెగెటివ్ టాక్ వచ్చిందా..? అందుకే బోయపాటి ఇలాంటి కామెంట్స్ చేశారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారట.. అయితే, అఖండ సినిమాపై దర్శకుడు ఇప్పుడు మాట్లాడేందుకు ఎందుకు ఇష్టపడటం లేదో ఆయన సన్నిహితులు తెలిపారట.. అదేంటంటే..
బోయపాటి లాస్ట్ మూవీ ‘వినయ విధేయ రామ’ మూవీ ఆయన అంచనాలను తలకిందులు చేసింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా అభిమానులకు బోయపాటి ప్రామిస్ చేశారట.. ఈ మూవీ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని.. కానీ సినిమా విడుదలయ్యాక అతని అంచనాలు తలకిందులయ్యాయి.దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారట.. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేస్తే రేపు అఖండ మూవీ విడుదలయ్యాక హిట్ అయితే ఓకే. కానీ నెగెటివ్ టాక్ వస్తే ఎలా అని బోయపాటి కొంత ఆందోళనతో ఉన్నారని తెలిసింది.

boyapati srinu About on Akhanda Movie
Akhanda Movie : రాంచరణ్ విషయంలో అంచనాలు తలకిందులు..
అందుకోసమే ఆయన నిన్న అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఎక్కువగా మాట్లాడలేదని తెలిసింది. ఏదైనా మూవీ విడుదలయ్యాకే మాట్లాడాలని నిర్ణయించుకున్నారట.. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ముందే హింట్ ఇచ్చేశారు. అదే జరిగితే బాలకృష్ణ, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్‌గా అఖండ నిలవడం ఖాయం..