Bigg Boss 8 : బిగ్ బాస్ 8 కోసం ఆ సీరియ‌ల్ స్టార్‌ని తీసుకొచ్చి పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారుగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss 8 : బిగ్ బాస్ 8 కోసం ఆ సీరియ‌ల్ స్టార్‌ని తీసుకొచ్చి పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారుగా..!

Bigg Boss 8 : తెలుగులో బిగ్ బాస్ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరి కొద్ది రోజుల‌లో ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకోనుంది.బిగ్ బాస్ ష‌క్ష తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2024,9:00 am

Bigg Boss 8 : తెలుగులో బిగ్ బాస్ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరి కొద్ది రోజుల‌లో ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకోనుంది.బిగ్ బాస్ ష‌క్ష తమిళ్, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తమిళ్ బిగ్ బాస్ కు కమల్ హాసన్, హిందీ సల్మాన్ ఖాన్, కన్నడలో సుదీప్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ గేమ్ షో రూపొందుతోంది. సీజన్ 7 కు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. అన్ని సీజన్స్ కంటే దీనికే ఎక్కువ టీఆర్ఫీ వచ్చింది. రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఫైనల్ వరకు నిలబడి క‌ప్ కొట్టుకొని వెళ్లాడు.

Bigg Boss 8  తేడా కొడుతుందే..

సీజన్ 7 లో ర‌చ్చ మాములుగా లేదు. అబ్బో సీరియల్ బ్యాచ్ గా కొంతమంది.. మరో బ్యాచ్ గా కొంతమంది.. మధ్యలో పెద్దమనిషిగా శివాజీ ఇలా చాలా ఆట జరిగింది. అయితే ఈ సీజన్ లో ప్రేక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాత్రం శివాజి, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అనే చెప్పాలి. శివాజీ హౌస్ లో ఉన్నవారిని కంట్రోల్ చేయడం, అలాగే ప్రశాంత్ కు సపోర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ సీజ‌న్ 7 స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో అనుకున్న సమయం కంటే ముందే సీజన్ 8 సిద్ధం కానుందని సమాచారం. ఆగస్టులో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. ఇప్పటికే కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజు బిగ్ బాస్ 8 లో పాల్గొంటున్నారని సమాచారం.

Bigg Boss 8 బిగ్ బాస్ 8 కోసం ఆ సీరియ‌ల్ స్టార్‌ని తీసుకొచ్చి పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారుగా

Bigg Boss 8 : బిగ్ బాస్ 8 కోసం ఆ సీరియ‌ల్ స్టార్‌ని తీసుకొచ్చి పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారుగా..!

స్టార్ మా టాప్ రేటెడ్ సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. మానస్-దీపికా రంగరాజు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దీపికా రంగరాజు చేస్తున్న కావ్య పాత్ర స్పెషల్ అట్రాక్షన్. బ్రహ్మముడి సీరియల్ సక్సెస్ లో దీపికా రంగరాజు పాత్ర చాలా ఉంది. ఒకవేళ దీపికా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెడితే ఆ సీరియల్ పరిస్థితి ఏంటనే వాదన ఉంది. అలాగే స్టార్ మా యాజమాన్యం సక్సెస్ఫుల్ సీరియల్ ని అటకెక్కించి దీపికాను బిగ్ బాస్ హౌస్ కి పంపే సాహసం చేస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్ర‌స్తుతానికి దీనికి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌ర‌గుతుండ‌గా, దీనిపై పూర్తి క్లారిటీ లేదు. సీజ‌న్ 8లో యూట్యూబర్ బంచిక్ బబ్లు, సురేఖావాణి, కిరాక్ ఆర్పీ, నటి హేమ, హీరో రాజ్ తరుణ్ లతో పాటు మరికొందరు పేర్లు వైరల్ అవుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది