Brahmanandam : నాతో ఎయిర్ హోస్టెస్ కాళ్లు మొక్కించాడంటూ అస‌లు సీక్రెట్ చెప్పిన బ్ర‌హ్మానందం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmanandam : నాతో ఎయిర్ హోస్టెస్ కాళ్లు మొక్కించాడంటూ అస‌లు సీక్రెట్ చెప్పిన బ్ర‌హ్మానందం

 Authored By sandeep | The Telugu News | Updated on :2 October 2022,4:30 pm

Brahmanandam : శ‌నివారం హైదారాబాద్‌లో అల్లు స్టూడియోస్ లాంచ్ ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్యక్ర‌మానికి చిరంజీవి, వెంక‌య్య నాయుడు, త్రివిక్ర‌మ్, అల్లు అర్జున్ (allu arjun ), రావు ర‌మేష్‌, బ్ర‌హ్మానందంతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రైన విష‌యం తెలిసిందే. క అల్లు రామలింగయ్య 100 పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా బుక్ కూడా లాంచ్ చేశారు. ఇక వేడుకలో బన్నీ స్పీచ్ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు చిరంజీవి, బ్ర‌హ్మానందం వంటి వారు చేసిన వ్యాఖ్యలు సైతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ కార్యక్ర‌మంలో బ్ర‌హ్మానందం మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్య గారు చాలా లోతుగా ఏ విషయం అయినా విశ్లేషించే వారంటూ బ్రహ్మానందం పేర్కొన్నాడు.ఇక త‌న కెరియ‌ర్ ప్రారంభంలో చిరంజీవి త‌న‌ని ఎలా ఆడుకునే వారో కూడా వివ‌రించాడు బ్ర‌హ్మానందం. నా కెరియర్ ఆరంభంలో జంధ్యాల గారు నన్ను చిరంజీవి గారికి పరిచయం చేశారు. ఆ సమయంలో మొదటి సారి విమానం ఎక్కేందుకు చిరంజీవి గారితో ఎయిర్ పోర్ట్‌ కి వెళ్ల‌గా, అక్క్కడున్న ఉద్యోగుల వద్ద ఇతను పిచ్చివాడు అన్నట్లుగా వారిని నమ్మించాడు. ఆ తర్వాత విమానం ఎక్కిన వెంటనే కొంతమంది అమ్మాయిలు ఉంటారు..

brahmanandam reveals old secrets

brahmanandam reveals old secrets

Brahmanandam : బ్ర‌హ్మీ సీక్రెట్స్..

వారి కాళ్లకు దండం పెట్టాలి, వాళ్ల కాళ్లు మొక్కి లోపలికి వెళ్లాలి అంటూ నాతో చెప్పాడు.. అది నిజమే అనుకొని ఎయిర్ హోస్టర్స్ యొక్క కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించాను.అప్పుడు వాళ్ళు కంగారు పడి ఏంటి అనుకుంటూ వెనక్కి జరిగారు. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చిన చాక్లెట్స్ ఒక్కొక్కటి 1500 రూపాయలు ఉంటుందని నాతో అన్నారు. మొత్తానికి చిరంజీవి గారు నన్ను అప్పట్లో చాలా ఏడిపించే వారంటూ బ్రహ్మానందం పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ అంద‌రిని న‌వ్వించారు. ఇక అల్లు రామ‌లింగ‌య్య విష‌యానికి వ‌స్తే 50 ఏళ్ల కాలంలో అయన ఎంతమంది దర్శకులతో నిర్మాతలతో పనిచేశారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది