Brahmanandam : రోజుకు రెండు కోట్లు తీసుకుంటే పెద్ద పుడింగివా కామెంట్స్‌పై బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు..!!
Brahmanandam : ఇటీవల బ్రహ్మానందం “అన్ స్టాపబుల్” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనటం జరిగింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో యంగ్ స్టార్స్ పై బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తవారిని ప్రోత్సహించాలని తెలియజేశారు. ఇప్పుడున్న వారితో సినిమా చేయడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు. ఈ సినిమాల్లో తనని నటింప చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దాదాపు 50 మంది నటీనటులతో ఈ సినిమా చేయటం ఆనందాన్ని ఇచ్చింది.
సన్నీ, సప్తగిరి, షకలక శంకర్, పృద్వి, పోసాని కృష్ణమురలి, చమ్మక్ చంద్ర ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో నటించారు. అప్పట్లో జంధ్యాల గారు, రేలంగి నరసింహారావు గారు, ఇవివి గారు, ఎస్వీ కృష్ణారెడ్డి గారి సినిమాల్లో ఇలా తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ తర్వాత అంతమంది హాస్యనటులు ఒక దగ్గరికి చేర్చి “అన్ స్టాపబుల్” లాంటి మంచి ఎంటర్ టైనర్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
యువ దర్శకులు మరియు నిర్మాతలు.. కష్టపడి చేసిన ఈ సినిమా అద్భుతమైన విషయాన్ని సాధించాలని ఆశిస్తున్నట్లు బ్రహ్మానందం కోరుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఇలానే ఉండేవాడిని. ఇలాంటి వాళ్ళ అందరిని ఆశీర్వదిస్తే పెద్దవాళ్లు అవుతారు. గొప్పవారవుతారు. తరువాత ప్రతి ఒక్కరూ బ్రహ్మానందం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
