Bro Movie 1st Day collections : బ్రో మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్..!!
Bro Movie 1st Day collections : మెగా మల్టీస్టారర్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan .. సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో.. నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్ లతోపాటు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా హైట్ క్రియేట్ చేయలేకపోయింది. పవన్ అభిమానులకు మాత్రం ఫుల్ మీల్స్ లాంటిది “బ్రో” అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. 647K డాలర్ లతో ఈ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. ప్రీమియర్స్ మిలియన్ డాలర్ క్లబ్ లో మొదటి స్థానంలో అదిపురుష్, రెండో స్థానంలో వీరసింహారెడ్డి ఉండగా.. మూడో స్థానంలో మొన్నటి వరకు ఉన్న “వాల్తేరు వీరయ్య” రికార్డును “బ్రో” బ్రేక్ చేసినట్లు సమాచారం. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ బట్టి చూస్తే మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల రేంజ్ నుండి 22 కోట్ల రేంజ్ షేర్ లో ఓపెనింగ్స్ అందుకున్నట్లు సమాచారం.
అయితే పవన్ కళ్యాణ్ గత ప్రీవియస్ సినిమాలతో పోల్చుతే…”బ్రో” సినిమా కలెక్షన్స్ తక్కువ అని టాక్. సినిమాలో స్టోరీ కంటే పవన్ కళ్యాణ్ హీరోయిజంకి పెద్దపీట వేయటం ఎలివేషన్స్ భారీగా ఉండటంతో సామాన్య ప్రేక్షకుల సహనానికి “బ్రో” ఓ పరీక్ష పెట్టినట్లు ఉందని సినిమా చూసిన ఆడియోన్స్ అంటున్నారు.