Bro Movie : బ్రో సినిమా రేపే రిలీజ్.. కానీ ఇంకా ఆ విషయం మీద క్లారిటీ రాలేదు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bro Movie : బ్రో సినిమా రేపే రిలీజ్.. కానీ ఇంకా ఆ విషయం మీద క్లారిటీ రాలేదు !

Bro Movie Review : రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒక్క సినిమా చేసినా ఆయనకు అభిమానులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో విడుదలయ్యే ప్రతి సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘ బ్రో ‘ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏ సినిమా జూలై 28న విడుదల […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 July 2023,2:00 pm

Bro Movie Review : రెండు తెలుగు రాష్ట్రాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఏడాదికి ఒక్క సినిమా చేసినా ఆయనకు అభిమానులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో విడుదలయ్యే ప్రతి సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ‘ బ్రో ‘ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏ సినిమా జూలై 28న విడుదల కాబోతుంది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ Sai Dharam Tej లీడ్ రోల్ చేశారు. అయినా ఇది పవన్ కళ్యాణ్ సినిమా లాగా నే ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే దీనికి కొంచెం హైప్ తక్కువగా ఉంది. అందుకు కారణం ఈ సినిమా క్లాస్ మూవీ కావడం, పవన్ చేసింది మాస్ పాత్ర కాకపోవడం ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాటలు కూడా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమా బుకింగ్స్ మొదలుపెట్టడం కూడా కొంచెం లేట్ అవ్వడంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న సందేహాలు వచ్చాయి. కానీ బుధవారం ఆ సందేహాలన్నింటికి తెరపడిపోయింది. విడుదలకు రెండు రోజుల ముందు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ మొదలైపోయాయి. ఉదయం నుంచి టికెట్లు అమ్మకాలు ఆన్లైన్లో జరుగుతున్నాయి.

Bro Movie

Bro-Movie

పవన్ గత సినిమాలు నిమిషాల్లో టిక్కెట్లు అయిపోయే పరిస్థితి ఉండేది కానీ ఈ సినిమాకి అంతగా లేకపోయినా బుకింగ్స్ జోరుగానే నడుస్తున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా నిడివి రెండు గంటల 15 నిమిషాలు మాత్రమే ఉంది. దీంతో ఎనిమిది గంటలకు ఆ తర్వాతే షోలు పడబోతున్నాయి. రెండు రాష్ట్రాలలో తొలి వీకెండ్లో ఐదు షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక సినిమా టికెట్లు కూడా ఎక్కడ పెంచలేదు. రెగ్యులర్ రేట్లకి అమ్మకాలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కూడా రేట్ల పెంపు కోసం ప్రయత్నించినట్లు కనిపించడం లేదు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది