Ananya Nagalla : నిర్మాత కొడుక్కే గాలం వేసిన వకీల్ సాబ్ బ్యూటీ… త్వరలోనే పెళ్లి బాజాలు..!
Ananya Nagalla : ఇటీవల అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పెళ్లి చేసుకోవడమే కాకుండా వీలనైంత త్వరగా పిల్లలకు కూడా జన్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది తన వివాహం గురించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2017లో షార్ట్ ఫిల్మ్‌ల కెటగిరీలో సైమా అవార్డు రావడంతో మేకర్స్ దృష్టిలో పడింది.’మల్లేశం’ అనే సినిమాతో అనన్య నాగళ్ల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీలో సహజసిద్ధమైనట నటనతో మెప్పించింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( pawan kalyan ) నటించిన ‘వకీల్ సాబ్’లోనూ అనన్య దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఈ మూవీలోనూ మంచి నటనతో మార్కులు కొట్టేయడంతో పాటు ఆఫర్లను అందుకుంది. ఇక ఆ సినిమాతో అందరి అటెన్షన్ తనవైపుకు తిప్పుకున్నప్పటికీ, పెద్దగా ఆఫర్స్ అయితే రావడం లేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా సందడి చేస్తుంది. ఇక ఈ అమ్మడి పెళ్లి వార్తలకి సంబంధించి తాజాగా అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. అనన్య నాగళ్ళ టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ చిన్న కుమారుడితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
calrity comes on ananya nagalla marriage
Ananya Nagalla : అవన్నీ పుకార్లే..
వీళ్ళ ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో పెళ్లి గురించి చర్చ జరిగిందట.కొన్ని నిబంధనలతో పెళ్ళికి కూడా అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరిగింది. దీనితో అనన్య నాగళ్ళ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీనిపై అనన్య నాగళ్ళ సెటైరికల్ గా స్పందిస్తూ అవి కేవలం పుకార్లు మాత్రమే అని తేల్చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై అనన్య నాగళ్ల ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ మేరకు తన ఖాతాలో ‘నాకోసం పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసిన వాళ్లకు థ్యాంక్స్. కానీ, అతడు ఎవరో నాకు కూడా చెప్పండి. అలాగే, మర్చిపోకుండా పెళ్లి డేట్, టైమ్ కూడా నాకు వివరించండి. అలా అయితేనే నా పెళ్లికి నేను రాగలను’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేసి ఆ వార్తలను కొట్టి పారేసింది.