Sirivennela Sitaramasastri: సిరివెన్నెల అకాల మరణానికి కారణమిదే.. డాక్టర్స్ ఏమన్నారంటే..!
Sirivennela Sitaramasastri : సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) మరణ వార్తతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. దాదాపు గత వారం పలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు సాయంకాలం కన్ను మూశారు.
Sirivennela Sitaramasastri: ఆరేళ్ల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్నారు
అయితే మొన్నటిదాకా బానే ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎందుకు హఠాత్తుగా చనిపోయారన్నది ఇప్పుడు అనేక మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. సీతారామ శాస్త్రికి చికిత్స అందించిన కిమ్స్ హాస్పిటల్ ఎండి భాస్కర్ రావు శాస్త్రి మరణంపై స్పందించారు. సిరివెన్నెల 6 ఏళ్ల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్నరని ఆయన తెలిపారు.
ఆ కారణంగా ఆయన సగం ఊపిరితిత్తును తొలగించాల్సి వచ్చిందన్నారు. అనంతరం ఓసారి బైపాస్ సర్జరీ కూడా చేసినట్లు వివరించారు. ఈ సర్జరీ జరిగిన అనంతరం శాస్త్రి 2 రోజులు బాగానే ఉన్నప్పటికీ.. తర్వాత ఆరోగ్య పరంగా అతను పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. దీంతో ఆయనను అడ్వాన్స్ ట్రీట్‌మెంట్ కోసం కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు వివరించారు.

reason behind sirivennela sitha rama shasthri death
Sirivennela Sitaramasastri : లంగ్స్ ఇన్‌ఫెక్షనే కారణం:
క్యాన్సర్ చికిత్సలో బాగంగా ముందుగా 45 శాతం ఊపిరితిత్తును తీసేసినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మిగిలిన 55 శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వివరించారు. శాస్త్రికి క్రమక్రమంగా ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారడంతో… ఎక్మోమిషన్‌పై పెట్టినట్లు పేర్కొన్నారు. ఆల్ రెడీ బైపాస్ సర్జరీ కావడం, ఆపై కాన్సర్ ఉండటం, కిడ్నీ కూడా పాడు కావడంతో అలా ఇన్‌ఫెక్షన్ ఆయన శరీరమంతా పాకడంతో పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచినట్లు వివరించారు.
సిరివెన్నెల అకాల మరణం చెందటం.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేసుకున్న దురదృష్టమని పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలిపారు. తెలుగు సాహిత్య చరిత్రలో సిరివెన్నెల ఎన్నో వేల పాటలను రచించారు. రచయిత గానే కాకుండా నటుడిగా కూడా గాయం, మనసంతా నువ్వే వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. నేడు సిరివెన్నెల అంత్యక్రియలు జరగనున్నాయి.