Siri vennela : ఆ ఇద్దరు హీరోలంటే సిరివెన్నెలకు చాలా ఇష్టమట… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Siri vennela : ఆ ఇద్దరు హీరోలంటే సిరివెన్నెలకు చాలా ఇష్టమట…

 Authored By mallesh | The Telugu News | Updated on :1 December 2021,1:40 pm

Siri vennela : దశాబ్దాల కాలం పాటు తెలుగు మూవీ ఇండస్ట్రీకి ఎన్నో మధుర గీతాలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించిన విషయాన్ని ఇంకా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు మూవీ ఇండస్ట్రీ ఓ మంచి పాటల రచయితను కోల్పోయింది. సిరివెన్నెల ఏ పాట రాసినా ముందు ఆయన ఆ పాత్రలో జీవిస్తారు. దానికి అనుగుణంగా పాట రాయడం మొదలు పెడతారు. ఇలా ఆయన కలం నుంచి జాలువారిన అద్భుత గీతాలు ఎన్నో.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ పాటలు రాస్తారు సిరివెన్నెల. అలాంటి రచయిత ఇక మన మధ్య లేకపోవడం బాధాకరం.సుమారు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీని తన పాటలతో మైమరపించ జేశారు సిరివెన్నెల.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అంటూ ఆలోచింపజేసే పాటలతో పాటు ప్రేమ పూర్వక పాటలు రాసేవారు. పలానా పాటలు రాయడంలో ఆయన దిట్ట అంటూ ఓ స్పెషల్ కేటగిరిని ఆయనకు కేటాయించలేం. ఎందుకంటే ఆయన అన్ని రకాల పాటలు రాశారు. అందులో ఎన్నో పాటలు చాలా మంది నోళ్లల్లో నానుతూనే ఉన్నాయి.అయితే సిరివెన్నెలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలంటే చాలా ఇష్టమట.. అందులో మొదటివారు మెగాస్టార్.. ఆయన డెడికేషన్ చూసి ఫిదా అయ్యారంట సిరివెన్నెల.

those two heroes are sirivennes favorite

those two heroes are sirivennes favorite

Siri vennela : మెగా ఫ్యామిలీకి చెందిన వారే..

రుద్రవీణ మూవీ టైంలో చిరంజీవి అంకిత భావాన్ని చూసి ఆయన చిరుకు ఫ్యాన్ గా మారిపోయారట. అంతటి స్టార్ డం ఉన్న హీరో ఇలాంటి మూవీలో నటించడం ఏంటని షాక్ అయ్యారట. ఇక చిరంజీవికి పాటలు రాయాల్సి వచ్చినప్పుడల్లా రాత్రి పగలు తేడా లేకుండా అదే పనిమీద ఉంటే వారట సిరివెన్నెల. ఇక మరో హీరో అల్లు అర్జున్.. చిరంజీవిలో ఉన్న డెడికేషన్ అల్లుఅర్జున్ లోనూ కనిపించిందని చాలా సార్లు సిరివెన్నెల కొనియాడారు. ఇలా ఇద్దరూ మెగా ఫ్యామిలీకే చెందిన వారు కావడం విశేషం. ఇలాంటి గొప్ప రచయిత దూరం కావడంతో ఆ భాద నుంచి సినీ ఇండస్ట్రీలో ఇప్పట్లో బయటకు రావడం కష్టమే.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది