Chalaki Chanti Sangeetha Who Replaces Singer Mano in Jabardasth Show
Chalaki Chanti : జబర్దస్త్ షోలో ఈ మధ్య ఏదీ నిలకడగా ఉండటం లేదు. యాంకర్ మారిపోయింది. జడ్జ్ మారిపోయింది. రోజా స్థానంలో ఇంద్రజ వచ్చింది. మనో ఉన్నాడో లేడో అర్థం కావడం లేదు. మధ్య మధ్యలో వస్తున్నాడు వెళ్తున్నాడు. ఆయనకు రీప్లేస్‌గా ఎంతో మందిని చూస్తున్నారు. ఎంతో మంది సీనియర్ హీరోయిన్లను తీసుకొచ్చి ఇంద్రజ పక్కన పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరూ శాశ్వతంగా ఉండటం లేదు. అందరూ రెండు మూడు ఎపిసోడ్‌లకు పరిమితమవుతున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒకరిని పట్టుకొచ్చారు. అప్పుడెప్పుడో వచ్చిన సంగీత మళ్లీ జబర్దస్త్ జడ్జ్ సీటులో కూర్చుంది. గతంలోనూ రెండు మూడు సార్లు ఆ కుర్చీలో కూర్చుంది.
ఇక ఇప్పుడు మళ్లీ ఆమెను పట్టుకొచ్చారు. గత రెండు వారాల క్రితం ఇలానే కుష్బూని పట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈమెను తీసుకొచ్చారు. సంగీతకు ఇది అలవాటైన కుర్చీనే. ఇది వరకు చూసిన షోనే. అయితే చలాకీ చంటి మాత్రం సంగీతను పొగడాల్సిన స్థితిలో మనోని కించపరిచినట్టు అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన జడ్జ్‌ను కీర్తించడం అక్కడ పరిపాటిగానే మారింది. ఈ క్రమంలోనే చంటి కాస్త తన భక్తిభావాన్ని చూపించాడు. జడ్జ్లో ఏంటి మనో గారు కనిపించడం లేదని ఒకడు అంటే.. పాటలు పాడే సింగర్ మనో కంటే.. ఆయన నేర్చుకున్న సంగీతాన్నే ఇక్కడకు తీసుకొచ్చారు అంటూ ఇలా సంగీతను ఆకాశంలోకి ఎత్తేశాడు.
Chalaki Chanti Sangeetha Who Replaces Singer Mano in Jabardasth Show
దీంతో సంగీత ఉబ్బితబ్బిబ్బైపోయింది. మొత్తానికి ఈ ప్రోమోలోనే కొత్త యాంకర్ గురించి ఇంట్రోడక్షన్ ఇచ్చారు. కానీ ఆమెను మాత్రం చూపించలేదు. అదో సర్ ప్రైజ్‌గా అందరూ ప్లాన్ చేసినట్టున్నారు. ఇక కొత్త యాంకర్ కోసం పల్లకిని కూడా ఏర్పాటు చేశారు.. ఆ యాంకర్ ఎవరు? ఆమె అయినా ఎన్నాళ్లు ఉంటుంది? లేదా రష్మీనే మళ్లీ జబర్దస్త్ షోకు యాంకర్‌గా పెట్టుకున్నారా? ఈ సంగీత ఎన్ని రోజులు ఉంటుంది.. రెండు మూడు ఎపిసోడ్లేనా? అన్నది తెలియాలంటే ఓ రెండు మూడు వారాల ఎపిసోడ్‌లు చూడాల్సిందే.
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా…
Coolie Movie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై…
Oriental Jobs : కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ…
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
This website uses cookies.