Chammak Chandra : ఈటీవీలో మళ్లీ కనిపించిన చమ్మక్ చంద్ర.. ఆ విషయంలో మల్లెమాల రాజీ!

Authored By aruna | The Telugu News | Updated on : 2 September 2022, 8:00 pm

Chammak Chandra : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయిన సమయం లో చమ్మక్ చంద్ర లేడీ గెటప్ వేసి ఎంతటి సంచలన సక్సెస్ ని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ కు ఈ స్థాయి క్రేజీ రావడానికి ప్రధాన కారకుల్లో చమ్మక్ చంద్ర ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన చాలా కాలం పాటు ఈటీవీ మరియు మల్లెమాలతో కలిసి జబర్దస్త్ ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోతున్న సమయం లో ఆయనతో కలిసి వేరే ఛానల్ కి వెళ్లిపోయాడు. చాలా మంది జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన తర్వాత ఇబ్బందులు పడ్డారు, కానీ చమ్మక్ చంద్ర మాత్రం తన ప్రతిభతో వేరు వేరు చానల్స్ లో కార్యక్రమాలు చేసుకుంటూనే సినిమాల్లో వరుసగా నటిస్తూ వస్తున్నాడు.

ఇప్పటి వరకు వందకు పైగా సినిమాల్లో ఆయన నటించి ఉంటాడు అంటూ సమాచారం అందుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత చమ్మక్ చంద్ర ఈటీవీలో కనిపించాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా చమ్మక్ చంద్ర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదల అయింది. చాలా సంవత్సరాల తర్వాత చమ్మక్ చంద్ర మరియు సత్య కలిసి ఈటీవీలో స్కిట్ చేయడంతో అంతా కూడా ఆ కార్యక్రమం కోసం ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Chammak Chandra in etv after long time

Chammak Chandra in etv after long time

గతంలో మల్లెమాల వారి నుండి వెళ్లి పోయిన కంటెస్టెంట్స్ కి మరియు ఇతరులకి రీఎంట్రీ లేదు.. కానీ చమ్మక్ చంద్ర కి రీఎంట్రీ దక్కింది. దాంతో గతంలో పెట్టుకున్న నిబంధనను మల్లెమాల వారు పక్కన పెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అదే నిజమైతే చాలా మంది మళ్లీ జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ మల్లెమాల ఓకే చెప్తే తప్పకుండా గతంలో మాదిరిగా అద్భుతమైన రేటింగ్ జబర్దస్త్ కి వస్తుందని అంతా నమ్మకంతో ఉన్నారు. మరి మల్లెమాల అందుకు ఓకే చెబుతుందా అనేది చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి