Chammak Chandra : జబర్దస్త్‌ లో చమ్మక్ చంద్ర రీ ఎంట్రీ… 10 ఏళ్ల వేడుకలో అద్భుతం జరగబోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chammak Chandra : జబర్దస్త్‌ లో చమ్మక్ చంద్ర రీ ఎంట్రీ… 10 ఏళ్ల వేడుకలో అద్భుతం జరగబోతుంది…!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 December 2022,4:35 pm

జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం అయ్యి వచ్చే ఫిబ్రవరి కి 10 సంవత్సరాలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ పది సంవత్సరాల కాలంలో జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్స్ వెళ్లిపోయారు. జడ్జిలు కూడా వెళ్ళి పోయారు. జబర్దస్త్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక భారీ ఈవెంట్ ని మల్లెమాల వారు ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఎవరెవరిని ఆహ్వానించాలి అనే విషయమై మల్లెమాల యొక్క అధినేత శ్యాంప్రసాద్ నిర్ణయించారని తెలుస్తోంది.

అంతే కాకుండా కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో వెళ్లి పోయిన వారిని మళ్లీ ఆహ్వానించే అవకాశాలు కూడా ఉన్నాయి. వారిని ఆ ప్రత్యేక ఎపిసోడ్ వరకే ఆహ్వానిస్తున్నారా లేదంటే పర్మినెంట్ గా జబర్దస్త్ లో వారికి అవకాశం కల్పిస్తారా అనేది చూడాల్సి ఉంది. జబర్దస్త్ కార్యక్రమం లో చమ్మక్ చంద్ర ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రస్తుతం సినిమాల్లోనే నటిస్తూ ఉన్నాడు. ఏ బుల్లి తెర కార్యక్రమం లోనూ ఆయన కనిపించడం లేదు. కనుక ఆయనకు జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నాడటజ

Chammak Chandra re entry in etv jabardasth show

Chammak Chandra re entry in etv jabardasth show

మల్లెమాల వారు కూడా ఆయనను తిరిగి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి జబర్దస్త్ లోకి చమ్మక్ చంద్ర రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మధ్య కాలం లో ఈటీవీ లో ప్రసారం అయిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో చమ్మక్ చంద్ర కనిపించాడు. కనుక ఆయన పూర్తి స్థాయిలో జబర్దస్త్ లో వచ్చినా కూడా అనుమానం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. మల్లెమాల వారు దయచేసి చమ్మక్ చంద్ర ను జబర్దస్త్ లోకి తీసుకు రావాలని అభిమానులు కోరుతున్నారు. మరి మల్లెమాల వారి నిర్ణయం ఏంటి అనేది చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది