Rangasthalam : ‘రంగస్థలం’ పాటలు రాసేందుకు పట్టిన సమయం అంతే : చంద్రబోస్
Rangasthalam సినిమాలకు పాటలు ఊపిరిపోస్తుంటాయి. ఆ పాటలకు బాణీ, సాహిత్యం జీవంపోస్తుంటాయి. అయితే ఒక్కో పాటల రచయితకు ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కో లిరిస్ట్ ఒక్కో సమయంలో పాటలురాస్తారు. కొందరు వ్యవధిని పెట్టుకుంటారు. ఇంకొందరు వ్యవధి లేకుండా అలా రాస్తూనే ఉంటారు. అయితే కొందరు ఒక్క ఐదు నిమిషాల్లో కూడా పాటను రాసేస్తారు. మరొకరు ఆరు నెలల్లో కూడా ఒక్క పాటను రాయలేరు. అలా చంద్రబోస్ తాను రంగస్థలం పాటలు రాయడానికి పట్టిన సమయాన్ని చెప్పేశాడు.
అర్దగంటకు ఓ పాట రాసేసిన చంద్రబోస్.. Rangasthalam
చంద్రబోస్ వచ్చే వారం ఆలీతో సరదాగా షోలో గెస్టుగా రాబోతోన్నాడు. ఈ మేరకు చంద్రబోస్ తన సినీ ప్రయాణం గురించి చెప్పాడు. ఓ పాట రాయడానికి తీసుకునే సమయాన్ని చెప్పాడు. ఎక్కువ సమయం పట్టిన పాట ఏంటి? అని ఆలీ ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. వన్ నేనొక్కడినే సినిమాలోని యూ ఆర్ మై లవ్ అనే పాట రాసేందుకు దాదాపు 29 రోజులు పట్టిందని చెప్పేశాడు. ఇక అదే సమయంలో రంగస్థలం గురించి ప్రస్థావించాడు.
అదే సుకుమార్, అదే దేవీ శ్రీ ప్రసాద్.. కానీ రంగస్థలంలో ఒక్కో పాటను అర్దగంటలో రెడీ చేశాను. ఏ ఒక్క పాట కూడా పేపర్ మీద రాయలేదు.. అంటూ చెప్పేశాడు. అలా అంత వేగంగా పాటలకు సాహిత్యాన్ని అందించి.. సినిమా విజయం అవ్వడంలో చంద్రబోస్ కీలకపాత్ర వహించాడు. రంగస్థలం పాటలు ఎప్పటికీ అలా నిలిచిపోతాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయని చంద్రబోస్ చెప్పుకొచ్చాడు.