Rangasthalam : గేదెతో సన్నివేశం అని రంగస్థలం నుండి ఆ హీరోయిన్ తప్పుకుందా?
ప్రధానాంశాలు:
Rangasthalam : గేదెతో సన్నివేశం అని రంగస్థలం నుండి ఆ హీరోయిన్ తప్పుకుందా?
Rangasthalam : రామ్ చరణ్ Ram Charan కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబుగా నటించి అలరించాడు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఈ పాత్రకు తొలుత మరో హీరోయిన్‌ను తీసుకోవాలని భావించారట సుకుమార్. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్.

Rangasthalam : గేదెతో సన్నివేశం అని రంగస్థలం నుండి ఆ హీరోయిన్ తప్పుకుందా?
Rangasthalam భలే ఛాన్స్ మిస్ చేసుకుంది..
“రంగస్థలం” సినిమా కోసం తొలుత అనుపమ పరమేశ్వరన్‌ను అడిషన్‌కు పిలవగా,ఆ సమయంలో తాను డైలాగులు చెప్పకుండా తల్లి వైపు చూస్తుండిపోయిందట. అంతేకాక ఇందులో డీ గ్లామర్ రోల్ చేయడంతో పాటు, గేదెలను కడుగుతు కొన్ని సన్నివేశాల్లో కనిపించాలని చెప్పడంతో కాస్త భయపడిన అనుపమ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
అనుపమ స్థానంలో సమంత నటించి పెద్ద హిట్ అందుకుంది. ఒకవేళ “రంగస్థలం” సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు..సినిమాలో రామలక్ష్మి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది.ఈ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుంది. సమంత తన సహజ నటనతో రామలక్ష్మి పాత్రకు జీవం పోయగా, ఇందులో ఆమె గ్రామీణ యువతిగా హావభావాలు, యాసతో ప్రేక్షకులని ఆకట్టుకుంది.