Nagarjuna : కింగ్ తో తండేల్ డైరెక్టర్ భారీ ప్లాన్.. రికార్డులు కాదు అంతకుమించి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : కింగ్ తో తండేల్ డైరెక్టర్ భారీ ప్లాన్.. రికార్డులు కాదు అంతకుమించి..!

 Authored By ramesh | The Telugu News | Updated on :21 February 2025,10:20 am

ప్రధానాంశాలు:

  •  Nagarjuna : కింగ్ తో తండేల్ డైరెక్టర్ భారీ ప్లాన్.. రికార్డులు కాదు అంతకుమించి..!

Nagarjuna : తండేల్ thandel తో నాగ చైతన్యకు Naga Chaitanya కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడమే కాకుండా 100 కోట్ల క్లబ్ లో చేరేలా చేశాడు డైరెక్టర్ చందు మొండేటి Chandoo Mondeti. అతను మామూలుగానే కింగ్ నాగార్జునకు Nagarjuna వీరాభిమాని. అందుకే నాగ చైతన్యకు Naga Chaitanya హిట్ ఇచ్చేందుకు ఇంతగా కష్టపడ్డాడు. నాగ చైతన్యతో ఆల్రెడీ ప్రేమం, సవ్యసాచి సినిమాలు చేసిన చందు మొండేటి హ్యాట్రిక్ మూవీగా తండేల్ తో సూపర్ హిట్ ఇచ్చాడు. ఐతే తండేల్ సూపర్ హిట్ తో పాటు నాగార్జునకు తన మీద ఉన్న ప్రేమను కూడా చూపిస్తున్నాడు చందు. ఇంత అభిమానం ఉన్న నాగార్జునతో మీ సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకు చందు మొండేటి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నాగ్ సార్ తో చేస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అన్నాడు. అంతేకాదు కమల్ హాసన్ విక్రం, రజినీకాంత్ కూలీ సినిమా రేంజ్ లో నాగార్జున సర్ తో సినిమా చేస్తానని అన్నాడు చందు మొండేటి. కింగ్ తో ఖతర్నాక్ సినిమా చేసి తీరుతా అంటున్నాడు ఈ డైరెక్టర్.

Nagarjuna కింగ్ తో తండేల్ డైరెక్టర్ భారీ ప్లాన్ రికార్డులు కాదు అంతకుమించి

Nagarjuna : కింగ్ తో తండేల్ డైరెక్టర్ భారీ ప్లాన్.. రికార్డులు కాదు అంతకుమించి..!

Nagarjuna : ఫ్యాన్ బోయ్ గా ఒక ఐడియా..

అభిమాన హీరోని తెర మీద ఎలా చూపించాలి అన్నది ఫ్యాన్ బోయ్ గా ఒక ఐడియా ఉంటుంది. అందుకే స్టార్ హీరోల ఫ్యాన్స్ చేసే సినిమాలకు ఒక రేంజ్ ఉఇంటుంది. ఈ క్రమంలో చందు మొండేటి కూడా నాగార్జునతో సినిమా అంటే చాలు అది వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి తండేల్ సక్సెస్ జోష్ లో ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా సూర్యతో ఉండొచ్చని టాక్.

వీటితో పాటు కార్తికేయ 3 కూడా ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి తండేల్ సక్సెస్ తో టాప్ లీగ్ లోకి వచ్చాడు చందు. అతనిలోని టాలెంట్ తెలుసు కాబట్టే రాజమౌళి లాంటి డైరెక్టర్ అతన్ని అప్రిషియేట్ చేశాడు. మొత్తానికి చందు సక్సెస్ ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. ఐతే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చందు ఎప్పుడు నాగార్జునతో సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. Nagarjuna, Chandu Mondeti, Thandel, Naga Chaitanya, Akkineni

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది