Charmme Kaur : అది చూసి ఆగలేకపోయాను.. గుట్టు విప్పిన ఛార్మీ
Charmme Kaur విజయ్ దేవరకొండ నటన గురించి అందరికీ తెలిసిందే. అమాయకుడిలా నటించగలడు. ఆగ్రహావేశాలతో ఊగిపోయే కుర్రాడిలా మెప్పించగలడు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం అంతగా డ్యాన్సులు వేయలేదు. ఇంత వరకు ఏ సినిమాలోనూ అంతగా ఊపున్న మాస్ స్టెప్పులు వేయలేదు. కానీ మొదటి సారి విజయ్ దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడట.

charmme kaur on vijay devarakonda dance
‘ముంబైలో లైగర్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ ఇది వరకు ఎప్పుడూ చేయనట్టుగా డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరుస్తారు. నన్ను నమ్మండి. మాస్ క్రేజీగా ఉండబోతోంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ చూశాక ఈ పోస్ట్ పెట్టకుండా ఉండలేకపోయాను.’ అంటూ ఛార్మీ ట్వీట్ వేశారు. అలా విజయ్ స్టెప్పులు చూసి ఛార్మీయే ఆగలేకపోతే ఆడియెన్స్ ఆగుతారా? అన్నది చూడాలి.

charmme kaur on vijay devarakonda dance
బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు.