Chinmayi : వ్యభిచారం చేసే వాళ్లు సిగ్గుపడొద్దు..చిన్మయి సంచలన వ్యాఖ్యలు..
Chinmayi : సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. నిస్సహాయ మహిళలకు అండగా నిలబడుతూ తమ వంతు సాయం చేస్తుంటుంది చిన్మయి. మీటూ ఉద్యమం మొదలైనపుడు రచయిత వైరముత్తు చేసిన దుశ్చర్య బయటపెట్టి ధైర్యంగా నిలబడింది. ఈ క్రమంలోనే మరికొంత మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాలను బయట ప్రపంచానికి తెలిపారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎవరైనా మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే స్పందిస్తుంటుంది చిన్మయి.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే చిన్మయి పలు విషయాలపై తన అభిప్రాయాలను బలంగా చెప్తుంటుంది.
ఇటీవల లైంగిక సంబంధ విషయాలపై చిన్మయి మాట్లాడగా, ఆమెను దూషిస్తూ దారుణమైన ట్రోల్ చేశాడు ఓ నెటిజన్. కాగా, ఇలా తనను ట్రోల్ చేసే నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది చిన్మయి. ఆడవాళ్లను తిట్టడంపై స్పందించింది. ఆడవాళ్లను తింటాలంటే..ల… అంటారని, ఇంగ్లిష్‌లో స్లట్ అంటారని, అదే మగవాళ్లను అయితే స్టడ్ అంటారని, అలా అనడం వల్ల మగవాళ్లు ఏదో సాధించినట్లవుతుందని ఆ పదాలను తప్పుబట్టింది చిన్మయి.
ఈ క్రమంలోనే సె వర్క్‌ను కింఛపరిచే వారు దుర్మార్గులని పేర్కొంది. చాలా మంది పనిలేక అన్నం లేక పేదరికంతో వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారని వివరించింది. వ్యభిచార గృహాలను రన్ చేసే మగవాళ్లు లేరా? అని ప్రశ్నించింది.
Chinmayi : జననాంగంతో మనిషిని జడ్జ్ చేయొద్దంటున్న చిన్మయి..
సె వర్కర్స్‌తో పని చేయించుకుంటున్న మగవాళ్లను ఏమనాలని అడిగింది. ఎన్నో దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధమని, సె వర్కర్స్ సిగ్గు పడాల్సిన అవసరం లేదని చిన్మయి స్పష్టం చేసింది. మొత్తంగా తనను విమర్శించే వాళ్లకు చిన్మయి శ్రీపాద గట్టి కౌంటరే ఇచ్చింది. తన వ్యక్తిత్వం, తన గౌరవంలో యోనిలో ఉండదని, జననాంగంతో మనుషులను జడ్జ్ చేయొద్దని చెప్పకనే చెప్పింది చిన్మయి.
చిన్మయి టాలీవుడ్ ఫిల్మ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. ఈ మూవీలో అక్కినేని అఖిల్ హీరో కాగా, హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది.