Chiranjeevi and Balakrishna on the same stage
Balakrishna : ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ఆర్.ఆర్.ఆర్. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహించాలని దర్శకుడు రాజమౌళి కార్యాచరణ సిద్ధం చేశాడు.త్వరలో ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది.
ఇది మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్ సినిమా కాబట్టి వారి తండ్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే చరణ్ కోసం చిరు.. తారక్ కోసం బాలయ్య రంగంలోకి దిగుతున్నట్లు టాక్ నడుస్తోంది.ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరు, బాలయ్య వచ్చేది నిజమే అయితే అభిమానులకు పెద్ద పండుగే అనుకోవాలి. దీనిపై అఫీషియల్ కన్‌ఫర్మేషన్, ఇన్విటేషన్ రావాల్సి ఉంది. అయితే అభిమానుల్లో మాత్రం ఈ వార్త రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ మూవీకి యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేశారు. అక్కడ ఈ బుకింగ్స్ ఫుల్లు స్వింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi and Balakrishna on the same stage
రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఆర్.ఆర్.ఆర్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ మూవీ కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడింది. తెలుగులో ఇద్దరు యువ అగ్రహీరోలతో పాటు బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ లాంటి క్రేజీ స్టార్లు నటించడంతో ఆర్.ఆర్.ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ మూవీకి యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేశారు.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.