Rashmi Gautam : బుల్లితెర రష్మి గౌతమ్ కెరీర్ చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్‌తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయింది. ఆమె ఆర్టిస్ట్‌గానే కాకుండా సామాజిక సేవల విషయంలో అందరి మన్ననలు పొందింది. మూగ జీవాల గురించి రష్మీ చేసే పోస్ట్‌లు అందరినీ కదిలిస్తుంటాయి. మూగ జీవాలను హింసించడం, వాటిని మనుషులు ఎంతలా వినియోగించుకుంటున్నారో అంటూ రష్మీ ఆవేదన చెందుతుంది.
కుక్క, ఆవు, గేదె, గుర్రాలు ఇలా ప్రతీ ఒక్క జీవరాశి గురించి రష్మీ స్పందిస్తుంటుంది.ఆ మధ్య గేదె, ఆవు పాల మీద స్పందించింది. గేదెలు, ఆవులు తమ పిల్లల కోసం పాలను ఉత్పత్తి చేస్తుంటే.. మనుషులు వాటిని అవసరానికి మించి తీసుకుంటున్నారు. అవి మనషుల కోసం పాలను ఉత్పత్తి చేస్తోన్నట్టు అయింది. వాటిని మనం హింసిస్తున్నామంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అందుకే తాను పాలు, పాల ఉత్పత్తులను కూడా వాడను అని తెలిపింది. ఇక తాజాగా మూగజీవిని మాంసం కోసం మార్కెట్‌లో అమ్మేయగా కన్నీరు పెట్టుకుంది.ఈ వీడియోని చూసి రష్మీ గౌతమ్ చాలా ఆవేదన చెందింది. అలానే డస్ట్ బిన్‌లో బ్లేడ్స్ వంటివి వేయోద్దని కోరింది.
వాటి వలన చాలా జీవులు మరణిస్తున్నాయని పేర్కొంది. రష్మీ గౌతమ్ మరీ ముఖ్యంగా వీధి కుక్కలను గాయపరిచే ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఇక నాన్ వెజ్ తినడాన్ని రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. వీధి కుక్కలు గాయాలతో కనిపిస్తే రష్మీ వెంటనే వాటిని చేరదీస్తుంది. తీవ్రంగా గాయపడి ఉంటే చేతనైనంతలో ఆపరేషన్ కూడా చేయిస్తుంటుంది. ఓ సారి అలానే ఓ పెట్‌కు గాయాలయ్యాయి. ఆపరేషన్ డబ్బుల కోసం రష్మీ తన అభిమానులను రిక్వెస్ట్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా చాలంటూ వేడుకుంది. అలా రష్మీ మూగ జీవాల మీద ప్రేమను కురిపిస్తుంటుంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.