Chiranjeevi : ఇండస్ట్రీ పెద్దరికంపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మెగాస్టార్ వ్యాఖ్యలు వైరల్..
Chiranjeevi : టాలీవుడ్ చిత్ర సీమకు దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్ద దిక్కుగా ఉండేవారు. కాగా, ఆయన మరణానంతరం ఇండస్ట్రీ పెద్దగా ఎవరు ఉండాలనే చర్చ చాలా కాలం నుంచి ఉంది. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని చాలా మంది ఈ సందర్భంగా అన్నారు. కరోనా సమయంలో ట్రస్ట్ ద్వారా తన వంతు విరాళం ఇవ్వడంతో పాటు మరి కొంత మంది హీరోల సహాయ సహకారాలతో చిరంజీవి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే చిరునే.. నెక్స్ట్ ఇండస్ట్రీ పెద్ద అని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాగా, పలువురు ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
(మా) ఎన్నికల సమయంలోనూ చర్చ జరిగింది. ఎన్నికలలో సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడు విష్ణు విజయం సాధించాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అన్నట్లు సీనియర్ హీరో నరేశ్, పలువురు పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. కాగా, తాజాగా ఇండస్ట్రీ పెద్దరికంపై మెగాస్టార్ చిరు పెదవి విప్పారు. ఇటీవల ‘యోధా డయాగ్నస్టిక్స్’ ప్రారంభోత్సవంలో సినీ ఇండస్ట్రీలోని అన్నీ విభాగాల వారికి రాయితీ ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలోనే డయాగ్నస్టిక్స్ వారు యాభై శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన హెల్త్ కార్డులను తాజాగా చిరంజీవి సమక్షంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో ఇచ్చారు.
Chiranjeevi : బాధ్యత గల బిడ్డగా ఉంటానంటున్న చిరంజీవి..
ఈ సందర్భంగా చిరంజీవి తాను సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించడం గురించి మాట్లాడారు.తాను టాలీవుడ్ చిత్రసీమకు పెద్దగా ఉండనని, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటానని చెప్పాడు. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తానని, అయితే, అనవసరమైన విషయాలపై తగుదునమ్మా అని ముందుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దరికం అనేది తనకొద్దని, ఏ సమయంలోనైనా అవసరం వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవడానికి తాను ఎప్పుడూ రెడీగా ఉంటానని పేర్కొన్నాడు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు చాలా పెద్ద ఇబ్బందని చెప్పుకొచ్చాడు మెగాస్టార్. చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.