Chiranjeevi : కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా సరే సినిమాలు చూస్తారు : చిరంజీవి
Chiranjeevi : బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజా సజ్జా. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ, దర్శకత్వ వహించారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా మెగా స్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేను ఇలా రావడానికి నాలుగు కారణాలు ఉన్నాయి. నేను హనుమంతుడి భక్తుడిని. అన్ని తానే అని నమ్మినవాడిని, అలాంటి హనుమంతుడి మీద సినిమా తీస్తే నేను రాకుండా ఎలా ఉంటాను.
అదొక కారణం అయితే డైపర్లు వేసుకున్న స్థాయి నుంచి నా ముందే డయాస్ ఎక్కే స్టేజ్ కి వచ్చిన తేజ మరొక కారణం. టీజర్ ట్రైలర్ చూస్తే విజువల్స్ సౌండింగ్ అన్నీ బాగున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాని అద్భుతంగా తీశారు. ఇక ప్రశాంత్ వర్మ తేజ వచ్చి నన్ను ఈవెంట్ కి రమ్మని అడిగారు. వెంటనే వస్తాను అని చెప్పాను. నా ఆరాధ్య దైవం గురించి ఎక్కువగా చెప్పుకునే సందర్భాలు రాలేదు. మనలో ఉన్న భక్తిని చెప్పుకోవాలా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి చెప్పుకోవాలనిపిస్తుంది అంటూ తన జీవితంలో హనుమంతుడు చేసిన ఎన్నో అద్భుతాలను చెప్పుకొచ్చారు. నాన్నగారు కమ్యూనిస్టు దేవుడు ఫోటోలకు కూడా దండం పెట్టేవారు కాదు. మా అమ్మ కోసం అప్పుడప్పుడు తిరుమల కు వెళ్లి వచ్చేవాళ్ళం. నేను హనుమంతుడిని బాగా నమ్మేవాడిని. రోడ్డుమీద ఒకసారి ఆట ఆడితే క్యాలెండర్ వచ్చింది.
అందులో ఆంజనేయుడు ఫోటో ఉంది. అది అప్పటినుంచి ఇప్పటివరకు నా వద్ద ఉంది. ఆయన వెంట నేను పడ్డానా లేక నావెంట ఆయన పడ్డారా తెలియకుండానే ఆయనతో నా అనుబంధం కొనసాగుతూ వచ్చింది. మా నాన్నకు కూడా నేను హనుమంతుడిని పరిచయం చేశాను. కమ్యూనిస్టు భావాలు నాస్తికుడి అయినా మా నాన్నగారు భక్తుడిగా మారారు అని చెప్పారు. ఇక హనుమాన్ సినిమా రిలీజ్ గురించి ధియేటర్ల గురించి మాట్లాడుతూ.. ఇది పరీక్షకాలం..థియేటర్లు అంతగా లభించకపోవచ్చు కానీ కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా సరే సినిమాలు చూస్తారు. అందరి సినిమాలు బాగా ఆడాలి. 2016లో ఖైదీ నెంబర్ 150 బాలకృష్ణ సినిమాలు వచ్చాయి. దిల్ రాజు ఆ టైంలో శతమానంభవతిని విడుదల చేశారు. కంటెంట్ బాగుంటే ఆడుతుందని ఆరోజు అన్నారు. హనుమాన్ కూడా అలానే ఆడుతుంది అని చెప్పుకొచ్చారు.