Chiranjeevi : చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ రిలీజ్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ రిలీజ్ ..!

 Authored By govind | The Telugu News | Updated on :11 February 2021,10:47 am

Chiranjeevi : చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకాభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచే పది మంది వరకు హీరోలున్నారంటే వీరందరి సినిమాలు ఒకే ఏడాదిలో వస్తే బాక్సాఫిస్ వద్ద సునామీ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. మెగాస్టార్ చిరంజీవి .. పవన్ కళ్యాణ్ సహా దాదాపు అందరు మెగా హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో ..నిర్మిస్తున్నవే. ఇక మెగాస్టార్ .. పవర్ స్టార్ .. మెగా పవర్ స్టార్ ల సినిమాలు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాలుగా రూపొందుతుండటం విశేషం.

chiranjeevi kalyan devs theme of kinnerasani released

chiranjeevi-kalyan-devs-theme-of-kinnerasani-released

తాజాగా మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. ఇండస్ట్రీ తో పాటు ప్రతీ ఒక్కరి చూపు ఈ సినిమా మీదే ఉంది. కాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కిన్నెరసాని’. ఈ సినిమా నుంచి తాజాగా  ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ ని రిలీజ్  చేశారు చిత్ర యూనిట్. ఈ ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ మెగా అభిమానులనే కాదు .. ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ రోజు కళ్యాణ్ దేవ్ బర్త్ డే సందర్భంగా కిన్నెరసాని సినిమా నుంచి ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ రిలీజ్ చేయడం విశేషం.

Chiranjeevi : కళ్యాణ్ దేవ్ లుక్ పరంగా పాజిటివ్ టాక్ వస్తోంది.

ఇక ఈ సినిమా కి ‘అశ్వథ్థామ’ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్న రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. మహతి సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక టీజర్ చివరిలో కళ్యాణ్ దేవ్ ని రివీల్ చేశారు. లుక్ పరంగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా తో పాటు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి అన్న సినిమాని చేస్తున్నాడు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది