Chiranjeevi : ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి భేటీ.. ఇండస్ట్రీ పెద్దగానే..?
Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండ దలుచుకోలేదని, అయితే, ఇండస్ట్రీకి ఏదేని కష్టం వచ్చినపుడు బాధ్యత కలిగిన బిడ్డగా స్పందిస్తానని అన్నాడు. ఈ క్రమంలోనే తాను అనవసర విషయాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదని స్పష్టం చేశాడు. అయితే, చిత్ర సీమకు కష్టాలు వచ్చినపుడు మాత్రం వాటిని గట్టెక్కించేందుకుగాను తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో చిరు ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నారని వార్తలొస్తున్నాయి.సినీ పరిశ్రమపై ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిరు, జగన్ ను కలవబోతున్నారని వార్తలు రావడం, ఆ భేటీ నిజంగానే ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.
భేటీలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలతో సినీ పరిశ్రమకు కలుగుతున్న నష్టాలపై చిరంజీవి వివరించనున్నారని తెలుస్తోంది. అయితే, తాను ఇదంతా కూడా ఇండస్ట్రీ పెద్దగా కాకుండా తన వంతు బాధ్యతగా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.గత కొంత కాలంగా దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే కొందరు చిరంజీవి పెద్ద అని అంటుండగా, మరి కొందరు మోహన్ బాబు అని అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మోహన్ బాబు తనయుడు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే, చిరంజీవి కూడా సినీ కార్మికులకు తన వంతు సాయంగా తన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉన్నాడు.
Chiranjeevi : ఏపీలో సినీ పరిశ్రమకు కలిగే నష్టాలపై జగన్‌కు చిరు వివరణ..!
ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులను యోధ డయాగ్నోస్టిక్స్ వారి తరఫున అందజేశాడు. అలా ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిస్తారని అంటున్నారు. టికెట్ల ధరల తగ్గింపుపై గత కొద్ది రోజులుగా ఏపీ మంత్రులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య వార్ నడుస్తోంది.