Chiranjeevi : 29 రోజుల్లో తీస్తే 512 రోజులు ఆడిన చిరంజీవి సినిమా.. ఇదో చరిత్ర..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో చాలా మందికి తెలీదు.కెరీర్ ప్రారంభంలో సైడ్ క్యారెక్టర్స్ చేసిన చిరు ఆ తర్వాత ప్రతినాయకుడి పాత్రలు కూడా చేశాడు. పునాది రాళ్లతో మొదలైన ఆయన ప్రస్థానం నెమ్మదిగా మెగాస్టార్ రేంజ్‌కు చేరుకుంది. చిరు తన సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఎంతో మంది కోట్ల అభిమానులను సంపాదించుకున్నారు. ఇదిలాఉంటే చిరు కెరీర్లో ఏకంగా 512రోజులు ఆడిన సినిమా ఉందని మీలో ఎవరికైనా తెలుసా.. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Chiranjeevi : దర్శకుడిగా కోడి రామకృష్ణ ప్రతిభ..
ఇంట్లో భార్య అంటే విపరీతమైన అభిమానం చూపిస్తూ మరో స్త్రీ మాట ఎత్తకుండా ఉంటారు కొందరు భర్తలు. బయటికు వెళ్లగానే వారితో చమత్కరిస్తూ మాట్లాడుతారు. అలాంటి వారినే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ అంటారనే నానుడి ఆధారంగా కోడి రామకృష్ణ అదే టైటిల్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1982 ఏప్రిల్ 23న విడుదలైన ఈ చిత్రానికి తొలుత యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత కాలక్రమేణా ప్రేక్షకాధరణ పెరిగి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా 512వ రోజులు సినిమాగా రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాలో చిరు రాజశేఖర్ అనే కామెడీ యాంగిల్ రోల్ ప్లే చేశారు.ఆయన కెరీర్‌లో మంచి చిత్రాల్లో ముందు వరుసలో ఉంటుంది ఈ సినిమా.చిరంజీవి సరసన నాయికగా జయ పాత్రలో నటించిన మాధవి కథకు కీలకమైన పాత్రలో పూర్ణిమ నటించిన ఈ చిత్రం ద్వారా సంభాషణల రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా పరిచయమయ్యారు. అమాయక స్త్రీలను మాటలతో లోబరుచుకుని జల్సా చేసే సుబ్బారావు పాత్రను గొల్లపూడి పోషించిన విషయం తెలిసిందే.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూ.3లక్షల 20వేల వ్యయమైన ఈ చిత్రానికి పాలకొల్లు, నర్సాపురం, పోడూరు, సకినేటిపల్లి, భీమవరం, మద్రాస్‌ల్లో సినిమా షూటింగ్ జరిపారు. సినిమా పూర్తయ్యాక సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కున్న రాఘవ పట్టు వదలకుండా పోరాడి వాటి నుంచి బయటపడ్డారు. జేవీ రాఘవులు స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సీ.నారాయనరెడ్డి రైటర్. ఎస్పీ బాలసుబ్రహ్మణం, పి.సుశీల గానం అందించారు.