Bhola Shankar : డేంజర్ జోన్ లో చిరంజీవి “భోళా శంకర్”సినిమా ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhola Shankar : డేంజర్ జోన్ లో చిరంజీవి “భోళా శంకర్”సినిమా ..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :31 July 2023,11:00 am

Bhola Shankar : మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన “భోళా శంకర్” ఆగస్టు నెల 11వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన వేదాళం సినిమాకి రీమేక్. తమిళంలో స్టార్ హీరో అజిత్ నటించారు. అన్నా చెల్లెల సెంటిమెంట్ నేపథ్యంలో వేదాళం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అయితే తెలుగులో కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికీ విడుదల చేసిన పాటలు మరియు టీజర్ ఇంకా ట్రైలర్ పర్వాలేదు అనిపించింది.

కానీ “భోళా శంకర్” ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా చీప్ గా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అయితే ఓవర్సీస్ లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లో ఇప్పటికీ 15 వేల డాలర్లు, రెండు తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. చిరంజీవి సినిమాలకు సంబంధించి ఇది చాలా చీప్ బిజినెస్ అని తాజా వార్తలు పై మెగా ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Interesting Update on chiranjeevi bhola shankar movie

Interesting Update on chiranjeevi bhola shankar movie

అయితే సినిమా దర్శకుడు మెహర్ రమేష్ కి సరైన గేట్లు లేకపోవడంతో పాటు రీమేక్ సినిమా కావటంతో బయ్యర్లు కూడా “భోళా శంకర్” నీ లైట్ తీసుకున్నట్లు సమాచారం. చిరంజీవి “వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 140 కోట్లు చేసింది. దానితో పోలిస్తే సగం కూడా “భోళా శంకర్” దాటకపోవడం.. నిర్మాతలకు టెన్షన్ పుట్టిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది