Rajamouli – Trivikram : ఆ ఒక్క మాటతో.. ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ మధ్య మొదలైన కోల్డ్‌వార్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli – Trivikram : ఆ ఒక్క మాటతో.. ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ మధ్య మొదలైన కోల్డ్‌వార్

 Authored By mallesh | The Telugu News | Updated on :16 September 2022,3:30 pm

Rajamouli – Trivikram : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీరిద్దరూ దిగ్గజ దర్శకులుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకరేమో ప్లాపులు అంటే తెలియని డైరెక్టర్.. మరొకరికి అపజయాలు కలిగినా తక్కువ బడ్జెట్‌తో భారీ కలెక్షన్లు రాబడుతాడని పేరుంది. కానీ వీరిద్దరి మధ్య ఒక హీరో విషయంలో కోల్డ్ వార్ నడుస్తోందని టాక్..

Rajamouli – Trivikram : ఒక్క స్టేట్మెంట్ వల్లే వీరి మధ్య గ్యాప్ పెరిగిందా..

ఎస్ఎస్ రాజమౌళి ఇండస్ట్రీలో బడా డైరెక్టర్. ఆయన సినిమాలు అన్ని భారీగా ఉంటాయి. తారాగణం కూడా మాములుగా ఉండదు. కథను దృష్టిలో పెట్టుకుని ఆయన మేకింగ్ కూడా చాలా వర్తబుల్ అంటుంటారు. బహుబలితో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో మరోసారి బ్లాక్ బాస్టర్ కొట్టాడు. త్వరలోనే మహేశ్ బాబుతో గ్లోబల్ వైడ్‌గా ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. అందులో మహేశ్ ప్రపంచవ్యాప్తంగా జర్నీ చేస్తాడని తెలిపాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికొస్తే వరుసగా హిట్లతో దూకుడు మీదున్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు ప్రస్తుతం మహేశ్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశాడు.

Cold war started between ss rajamouli and trivikram

Cold war started between ss rajamouli and trivikram

దీనికి స్పందన కూడా బాగానే వస్తుందట. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ మహేశ్ మూవీ గురించి చర్చ జరుగుతుండగా.. రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్‌తో త్రివిక్రమ్ మూవీ గురించి ఆలోచించడం జనాలు మానేశారట.. వారి థింకింగ్ అంతా రాజమౌళి, మహేశ్ బాబు సినిమాపైనే ఉందని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటుడు మహేశ్‌తో త్వరగా సినిమా చేయాలని దర్శకధీరుడుని సోషల్ మీడియా వేదికా కోరుతున్నారట.తన సినిమాకు దక్కాల్సిన క్రెడిట్ దక్కకుండా రాజమౌళి కావాలని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఆర్ఆర్ఆర్ మూవీ సినిమా విజయంపై త్రివిక్రమ్ స్పందించలేదని కూడా వార్తలు హైలెట్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది