Brahmanandam : దేశం లో ఎవ్వరి వల్లా కానిది సాధించిన బ్రహ్మానందం .. అమితాబ్ బచ్చన్ కూడా దండం పెట్టేసాడు !
Brahmanandam : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 1000కి పైగా సినిమాలలో కమెడియన్ నటించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలించారు. ప్రస్తుతం బ్రహ్మానందం అడపా దడపా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు సినిమాల ఎంపికల పరంగా చాలా సెలెక్టివ్ గా మారారు. ఇప్పుడు విరామ సమయానికి నచ్చిన విధంగా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. డ్రాయింగ్ తనకు ఇష్టమైన మరో కళ. అందుకే ఎక్కువసేపు డ్రాయింగ్ వేయడంతో బిజీగా గడుపుతారు. బ్రహ్మానందం […]
Brahmanandam : టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 1000కి పైగా సినిమాలలో కమెడియన్ నటించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలించారు. ప్రస్తుతం బ్రహ్మానందం అడపా దడపా సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు సినిమాల ఎంపికల పరంగా చాలా సెలెక్టివ్ గా మారారు. ఇప్పుడు విరామ సమయానికి నచ్చిన విధంగా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. డ్రాయింగ్ తనకు ఇష్టమైన మరో కళ. అందుకే ఎక్కువసేపు డ్రాయింగ్ వేయడంతో బిజీగా గడుపుతారు. బ్రహ్మానందం పేరులోనే ఆనందం ఉంది. అసలు వృద్ధాప్యం అనేది ఆయనకు లేదు. తనదైన కామెడీ నటన టైమింగ్ కోట్లాదిమంది ప్రజలను అలరించాడు.
హాస్య నటుడిగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. కేవలం హాస్యంతోనే కాదు ఎమోషనల్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు. చిరస్థాయిగా అందరి గుండెలో నిలిచి ఉన్నారు. రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రలు చేస్తూ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఐకాన్ స్టార్ గా బ్రహ్మానందం నిలిచారు. ఇప్పటికీ బ్రహ్మానందం నటనలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో బ్రహ్మానందం సినిమాల ద్వారా ఎంతవరకు సంపాదించి ఉంచాడు అని చర్చ జరుగుతుంది. బ్రహ్మానందం ఒక్కో సినిమాకు ఒకటి, రెండు కోట్లు తీసుకుంటారు. దాదాపుగా 1000 పైగా సినిమాల్లో నటించారు.
వచ్చిన డబ్బులతో తెలివిగా పెట్టుబడులు పెట్టి అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దాదాపుగా బ్రహ్మానందం కు 350 కోట్ల వరకు ఆస్తి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి బ్రహ్మానందం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కమెడియన్ గా బ్రహ్మానందం ప్రేక్షకులు మదిలో చిరస్థాయిగా నిలిచాడు. ఇదే అతడికి గొప్ప ఆస్తి. ఇతర ఆస్తులను అతనికి బోనస్ అని భావించాలి. ఇప్పటికీ బ్రహ్మానందం సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ కమెడియన్ గా బ్రహ్మానందం ఉన్నారు. బెస్ట్ కమెడియన్ గా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.