Comedian Harsha : మొన్నే పెళ్లి నేడు గోవా.. స్పీడు మీదున్న కమెడియన్ హర్ష
Comedian Harsha కమెడియన్ హర్ష నిశ్చితార్థం ఎప్పుడో జరిగింది. కానీ కరోనా వల్ల పెళ్లిని కాస్త వాయిదా వేసినట్టున్నాడు. గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అలా పెళ్లిని పోస్ట్ పోన్ చేశాడేమో. అయితే హర్ష మాత్రం మంచి స్పీడు మీదున్నట్టు కనిపిస్తోంది. అక్షర హర్షల వివాహాం జరిగిన మరుసటి రోజే హనీమూన్ ట్రిప్ వేసేశాడు. హర్ష తనకు ఇష్టమైన ప్రదేశంలోనే హనీమూన్ ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు హనీమూన్‌లో ఇప్పుడు హర్ష ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Comedian Harsha In Goa With His Wife Akshara For Honey moon
అక్టోబర్ 20న అవినాష్ అనూజల పెళ్లి జరిగింది. మరో వైపు కమెడియన్ హర్ష అక్షరల పెళ్లి కూడా జరిగింది. బిగ్ బాస్, జబర్దస్త్ సెలెబ్రిటీలు అవినాష్ పెళ్లికి వెళ్లారు. ఇక వెండితెర తారలు హర్ష వివాహానికి హాజరయ్యారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్‌కేఎన్ వంటి వారు హర్ష పెళ్లికి వెళ్లారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక హర్ష తన సతీమణిని తీసుకుని హనీమూన్‌కు చెక్కేశాడు. తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తితో ఇష్టమైన ప్రదేశానికి వెళ్తున్నాను అని చెప్పాడు హర్ష.
Comedian Harsha గోవాకు వెళ్లిన హర్ష

Comedian Harsha In Goa With His Wife Akshara For Honey moon
తీరా ఆ ఇష్టమైన ప్రదేశం ఏంటో అని చూస్తే అది కాస్తా గోవా అని తెలిసింది. ప్రస్తుతం ఈ కొత్త జంట గోవాలో దుమ్ములేపుతోంది. బ్రీజర్లు తాగుతూ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో కాళ్లతో జలకాలాటలు ఆడుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి హర్ష మాత్రం హనీమూన్ హ్యాంగవుట్‌లోనే ఇంకా ఉన్నట్టు కనిపిస్తోంది. గోవాలో ఈ కొత్త జంట ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి. మొత్తానికి కలర్ ఫోటో విడుదలై ఏడాది అవుతోంది. ఆ సినిమా హర్షకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు హనీమూన్ ఖుషీలో హర్ష గాల్లో తేలిపోతోన్నాడు.