Comedian Sudhakar : స్టార్ హీరో కావాల్సిన సుధాకర్.. ఒక కమెడియన్ గా ఎందుకు మిగిలిపోయాడు? ఆయన జీవితంలోని చీకటి కోణం ఏంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Comedian Sudhakar : స్టార్ హీరో కావాల్సిన సుధాకర్.. ఒక కమెడియన్ గా ఎందుకు మిగిలిపోయాడు? ఆయన జీవితంలోని చీకటి కోణం ఏంటి?

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,7:00 pm

Comedian Sudhakar : కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ, విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో కంటే ముందే తమిళంలో సుధాకర్ ఒక చరిత్ర సృష్టించాడు. రజనీకాంత్ లాంటి ఇమేజ్ ఆయనకు ఆ రోజుల్లోనే ఉండేదని చాలామందికి తెలియదు. పెద్ద హీరోగా, స్టార్ హీరోగా ఎదగాల్సిన సుధాకర్ ను తొక్కేశారని చాలామంది అంటుంటారు. ఉవ్వెత్తున ఎగసి వందల సినిమాల్లో హీరోగా నటించిన ఆయన కెరీర్ ఉన్నట్టుగా పాతాళంలోకి పడిపోవడం వెనుక కొన్ని శక్తులు ఉన్నాయనేది ఎవ్వరూ ఒప్పుకోని వాస్తవం. స్టార్ హీరో కావాల్సిన సుధాకర్ ఎందుకు కమెడియన్ గా మారాడు.

సుధాకర్ ది ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అనే ఊరు. తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేవారు. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వల్ల రాష్ట్రమంతా తిరగాల్సి వచ్చింది. వివిధ ఊళ్లలోనే సుధాకర్ బాల్యం గడిచింది. తెలుగు ప్రేక్షకులకు మంచి నటుడిగా, విలన్ గా, కమెడియన్ గా సుపరిచితుడు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ కు బెస్ట్ ఫ్రెండ్. అప్పట్లో సుధాకర్, చిరంజీవి ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారు.
పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నా తమిళ సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాల వల్ల అక్కడి నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీకి సుధాకర్ వచ్చేశాడు. ఇక్కడికి వచ్చాక సహాయ నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా దాదాపు 600 సినిమాల్లో సుధాకర్ నటించాడు.
1990 లో వచ్చిన ప్రతి సినిమాలో సుధాకర్ ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ను మనం అర్థం చేసుకోవచ్చు. తెర మీద సుధాకర్ కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు వెలిగిపోయేవి. కొన్ని అనారోగ్య కారణాల వల్ల సుధాకర్ తెలుగు సినిమాలకు కూడా దూరం అయ్యారు.

Comedian sudhakar Life Story In Telugu

Comedian sudhakar Life Story In Telugu

ఒకే యాక్టింగ్ స్కూల్ నుంచి సుధాకర్, చిరంజీవి ఇద్దరూ పట్టా పుచ్చుకున్నారు. చిరంజీవి కంటే ముందే తమిళంలో వెండి తెర మీద సుధాకర్ కనిపించాడు. ఆ తర్వాత హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. సుధాకర్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కేవలం 3 సంవత్సరాల్లోనే తమిళంలో 45 సినిమాల్లో నటించాడు. సుధాకర్ దూకుడును చూసి అప్పట్లో తమిళంలోని ఇతర హీరోలు భయపడ్డారట. దీంతో సుధాకర్ ను తొక్కేయడం ప్రారంభించారట. అదే క్రమంలో ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేశారట. అగ్ర నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోలు కలిసి సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సుధాకర్ ను కుట్రలు చేసి మరీ అడ్డుకున్నారట. తను హీరోగా నటించిన ఎక్కువ సినిమాల్లో హీరోయిన్ గా రాధికే నటించింది. వీళ్ల జంట గురించి అప్పట్లో చాలా పుకార్లు వచ్చాయి.

ఏది ఏమైనా తెలుగు వ్యక్తి అయిన సుధాకర్ కెరీర్.. తమిళంలో ముగిసిపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీకి సుధాకర్ వచ్చి కమెడియన్ గా స్థిరపడాల్సి వచ్చింది. తమిళంలో హీరోగా ఎదిగిన సుధాకర్, తెలుగులో కెరీర్ మొదట్లో విలన్ గా చేశాడు. ఆ తర్వాత చిరంజీవి సినిమా యముడికి మొగుడులో హాస్యనటుడిగా నటించి తన సత్తా చాటాడు సుధాకర్. ఆ తర్వాత సుధాకర్ కు ఎక్కువగా కామెడీ పాత్రలే రావడంతో చివరకు తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా సుధాకర్ స్థిరపడిపోయాడు.
తెలుగులో పలు సినిమాలకు సుధాకర్ చాలా అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు. ఇలా.. సుధాకర్ తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్, నిర్మాతగా ఎదిగాడు.
ఈ వీడియో మీకు ఎంతో కొంత సమాచారాన్ని అందించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలను ఈ చానెల్ లో మీకోసం త్వరలో అందిస్తాం.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది