Salman Khan : ఇండియన్ స్టార్ సెలబ్రిటీస్ లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినటువంటి సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్ సల్మాన్ ఖాన్ గతంలో చాలా బ్రేకప్ అనుభవాలను కూడా అతను ఎదుర్కొన్నాడు. ఒక స్టార్ హీరోయిన్ తో కూడా ప్రేమ నుంచి పెళ్లి వరకు వెళ్లినట్లు టాక్ వచ్చింది. ఇక సల్మాన్ ఫైనల్ గా కొందరు చేసిన మోసాలకు తట్టుకోలేకనే పెళ్లి అనే బంధానికి కూడా దూరమయ్యాడు అని చెబుతూ ఉంటారు. పలు ఇంటర్వ్యూలలో కూడా ప్రేమ పెళ్లి బంధం చాలా సెన్సిటివ్ అని వాటిని కొనసాగించాలి అంటే చాలా కష్టమైన పని అని చెబుతుంటాడు.
Salman Khan : సల్మాన్ ని అంత మాట అన్నాడేంటి?
సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేసే రియాల్టీ షో బిగ్ బాస్ 10లో పాల్గొన్న ఓ వివాదాస్పద కంటెస్టెంట్ సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశాడు.అతని పేరు స్వామి ఓం. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు అతని ప్రవర్తన కారణంగా ఇంటి నుండి బహిష్కరించబడ్డాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతడు ప్రవర్తన మారలేదు. బయటకు వచ్చిన తర్వాత అతను సల్మాన్ ఖాన్‌పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. సల్మాన్‌కు లండన్‌లో ఒక కుమార్తె ఉందని, అతనికి ఎయిడ్స్ కూడా ఉందని, అందుకే తాను పెళ్లి చేసుకోడని పేర్కొన్నాడు. సల్మాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ అని, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం, అబూ సలేంలు తన స్నేహితులని పేర్కొన్నాడు.

సల్మాన్ ఖాన్‌కు ఎయిడ్స్ ఉందని బిగ్ బాస్‌కు కూడా చెప్పాను. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 3 నిమిషాల్లోనే రిపోర్ట్ వచ్చేస్తుంది. అందుకే అతడు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు . సల్మాన్ జీవితంలో మాత్రం కొన్ని లవ్ స్టోరీలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. ఒక స్టార్ హీరోయిన్ కారణంగానే అతడు పెళ్లి అనే మాటను కూడా దూరమయ్యాడు అని టాక్ వచ్చింది. సల్మాన్ ఖాన్ కొత్త హీరోయిన్స్ తో నటించడానికి ఎక్కువగా ఇష్ట పడుతూ ఉంటాడు. ఇక సల్మాన్ ఖాన్ ప్రతిసారి వారితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా చాలానే వస్తూ ఉంటాయి