Nayanthara : తమిళనాడు కాంట్రవర్సీ… నయనతార కవల పిల్లలకి తండ్రి??
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులకు ఇటీవల కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే. వాళ్లు తమ కవల పిల్లలకు సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదే సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. మేము కవల మగ పిల్లలకు అమ్మానాన్నలం అయ్యాం అంటూ నయనతార భర్త విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేయడంతో అసలు వీళ్ల పెళ్లి అయి నాలుగు నెలలు కూడా కాలేదు. అప్పుడే కవల పిల్లలు ఎలా పుట్టారంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు నయనతారకు గర్భం వచ్చినట్టు కూడా తెలియలేదు. అసలు ఏం జరిగింది అని అంతా అనుకున్నారు.
కానీ.. తను పిల్లలను కన్నది సరోగసీ ద్వారా అని తెలిసి అప్పుడు కానీ నెటిజన్లు, సినీ అభిమానులు ఊపిరి పీల్చుకోలేదు. సరోగసీ ప్రక్రియ ద్వారా నయనతార, విఘ్నేష్ శివన్ తల్లిదండ్రులు అయ్యారు. పిల్లలు పుట్టడమే కాదు..వాళ్లకు పేర్లు కూడా పెట్టేశారు. ఉయిర్, ఉలగమ్ అనే పేర్లు పెట్టి ఇద్దరు మగ పిల్లలను తమ ఇంట్లోకి ఆహ్వానించినట్టు విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే.. నయనతార సరోగసీ ప్రక్రియ ద్వారా కవల పిల్లలను కనడంపై తమిళనాడు వ్యాప్తంగా ఇది పెద్ద కాంట్రవర్సీ అయింది.

controversy on nayanthara and vignesh twins
Nayanthara : నయన్ కవల పిల్లలపై తమిళనాడు వ్యాప్తంగా చర్చ
దీనిపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి పోకడలు మంచివి కావని, భవిష్యత్తులో ఇవి దారితప్పి లేనిపోని సమస్యలు తీసుకొస్తాయని అంటున్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి రిలేషన్ షిప్ లో నయనతార, విఘ్నేశ్ శివన్ ఉండి చివరకు ఈసంవత్సరం జూన్ 9 న ఒక్కటయ్యారు. మహాబలిపురంలో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇక.. తన వర్క్ పరంగా చూసుకుంటే నయనతార ఇటీవల నటించిన గాడ్ ఫాదర్ మూవీ సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలోనే అజిత్ సరసన నయనతార మరో సినిమా చేయనుంది.