Balakrishna – Nagarjuna : అలా అనడం తప్పే క్షమించు.. నాగార్జునకి బాలయ్య ఫోన్ కాల్ !?

Advertisement

Balakrishna – Nagarjuna : గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే వార్త ట్రెండ్ అవుతోంది. వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీని బాలకృష్ణ కించపరిచారని అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఏఎన్నార్ మనవళ్లు నాగ చైతన్య,

Advertisement

అఖిల్ కూడా స్పందించారు. దానికి సంబంధించి ట్వీట్ చేశారు. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు అని వాళ్లను అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అవుతుంది అంటూ నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దీనిపై ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలకృష్ణ ఈ విషయంపై స్పందించాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
debate on nandamuri balakrishna comments on akkineni
debate on nandamuri balakrishna comments on akkineni

Balakrishna – Nagarjuna : ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్

చివరకు టీవీ షోలలో కూడా ఈ వివాదంపై చర్చ జోరుగా సాగుతోంది. అసలు బాలకృష్ణ ఎందుకు అలా మాట్లాడారో ఆయనే క్లారిటీ ఇస్తే బెటర్ అని మరికొందరు వాదిస్తున్నారు. మరోవైపు కాపు నాడు కూడా బాలకృష్ణకు అల్టిమేటమ్ జారీ చేసింది. కాపు సామాజిక వర్గం కూడా బాలయ్య వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. ఈ నెల 25 లోపు బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే కాపులంతా కలసి నిరసన చేస్తామని స్పష్టం చేశారు. అక్కినేనితో పాటు ఆ రంగారావు అంటూ రంగారావును కూడా బాలకృష్ణ అవమానించారని రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణపై ఫైర్ అవుతున్నారు.

Advertisement
Advertisement