Deepika Padukone : బ‌ట్ట‌లు లేకుండా స్టార్ హీరోయిన్ భ‌ర్త ఫొటో షూట్.. ఇదేం పైశాచికం..!

Authored By Sam C | The Telugu News | Published on: July 22, 2022, 5:30 pm

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితం. ప్ర‌స్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రంలో క‌థానాయికగా న‌టిస్తుంది. ఈవిడ భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ కూడా చాలా ఫేమ‌స్. బాలీవుడ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఆయనకు పేరుంది. మాస్‌, యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌ ఇమేజ్‌ని ఏర్పర్చుకున్నారు. సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన పని బాలీవుడ్‌ మొత్తం షాక్‌ కి గురి కావడం గమనార్హం. ఇక అభిమానులు, నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. పేపర్ మ్యాగజైన్ కోసం అతను ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చాడు.

ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండగా.. రణ్‌వీర్‌పై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ‘అతను అమ్మాయిలను చూసి ఇన్‌స్పైర్ అయినట్లు ఉన్నాడు.. అందాలు చూసి తరించండి అయ్యా..’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫొటోలతో టీనేజ్ కుర్రాళ్లు చెడిపోతారని అంటున్నారు. ఇదేం పని రణ్‌వీర్.. బాలీవుడ్‌ని వదిలేయాల్సిన టైమ్ వచ్చిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు రణ్‌ వీర్‌ సింగ్‌ డేర్‌నెస్‌కి ప్రశంసలు కురిపిస్తున్నారు. చూడ్డానికి నగ్నంగా కనిపించినా, తనలో ఎలాంటి నగ్నత్వం లేదని అసలైన ఆత్మని చూపించావని, గొప్ప పని చేశావని ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా ఆయన ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

Deepika Padukone husband stunning photo shoot

Deepika Padukone husband stunning photo shoot

Deepika Padukone : బాబోయ్ ఏందీ ర‌చ్చ‌..

దీంతో ఇప్పుడు నెట్టింట రణ్‌ వీర్‌ సింగ్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. ఎప్పుడు రణ్‌వీర్ సింగ్ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన నటించే యాడ్స్‌లో కూడా సరికొత్తగా కనిపిస్తారు. అయితే తాజాగా ఏకంగా న్యూడ్ ఫొటో షూట్‌తో ఇంటర్నేట్‌ను షేక్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలె టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్‌గా 83 మూవీ మెప్పించారు. త్వర‌లోనే ఈ స్టార్ హీరో స‌ర్కస్ , రాకీ ఔర్ రాణి ప్రేమ్ క‌హాని సినిమాతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఫొటోల‌పై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by DietSabya® (@dietsabya)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp