Rashmi Gautam : రష్మి బుగ్గల మీద ముద్దుల వర్షం.. దెబ్బకు షాక్ తిన్న యాంకర్.. వీడియో
Rashmi Gautam : జబర్దస్త్ షోలో యాంకర్లను తమ స్కిట్లలో వాడుకోవడం ఎప్పటి నుంచో వస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అనసూయను ఆది, రష్మీని సుధీర్ వాడుతుంటారు. కానీ ఈ మధ్య ప్రతీ ఒక్కరూ యాంకర్లను కూడా తమ స్కిట్లలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా రష్మిని బాగానే వాడేశాడు జీవన్. అసలే ఆరోగ్యం బాగా లేక ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన జీవన్ తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో చైల్డ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడుతున్నాడు.

Deeven Brother Ks Anchor rashmi gautam
అసలే కరోనా వల్ల చిన్న పిల్లలను జబర్దస్త్ స్టేజ్ మీదకు రానివ్వడం లేదు. అందుకే నేహాంత్, దమ్ము దీవెన వంటి వారెవ్వరూ కనిపించడం లేదు. కానీ చాలా రోజుల తరువాత దీవెన జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చింది. ఆమె ఒక్కతే రాకుండా తన తమ్ముడిని కూడా జబర్దస్త్ వేదిక మీదకు తీసుకొచ్చింది. ఇకపై అతడు కూడా స్కిట్లలో ఉండబోతోన్నట్టున్నాడు. వచ్చీ రావడంతోనే పర్ఫామెన్స్‌తో ఆడుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ బుడ్డోడు ఏకంగా రష్మీ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు.

Deeven Brother Ks Anchor rashmi gautam
దెబ్బకు షాక్ తిన్న రష్మి యాంకర్ rashmi gautam
దీవెన తన తమ్ముడు అని అందరికీ పరిచయం చేసింది. రోజా గారు అని దండం పెట్టు అన్నట్టుగా సైగలు చేస్తే.. ఏకంగా సాష్టంగా నమస్కారం చేసేశాడు. ఐతే ఐదేళ్లు ఫిక్స్ అన్నట్టే అని దీవెన్ కౌంటర్ వేసేసింది. ఇక ఆమె రష్మీ అని చెప్పడంతోనే ఆలస్యం చేయకుండా.. పరిగెత్తుకుంటూ వెళ్లి.. రష్మి బుగ్గల మీద ముద్దులుపెట్టేశాడు. దీంతో రష్మీ దెబ్బకు షాక్ అయింది. ఆ తరువాత మరో సందర్భంలో పెళ్లి వయసు వచ్చిందని బుడ్డోడు సిగ్గుపడితే.. నేను రెడీ అని రష్మీ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇది కూడా చదవండి ==> దుమ్ములేపిన కీరవాణి.. RRR నుండి మొదటి సాంగ్ విడుదల
ఇది కూడా చదవండి ==> సమంత పేరు పక్కన అక్కినేని తీసేయడానికి కారణం ఇదా..?
ఇది కూడా చదవండి ==> షకీలాకి ఇంత అందమైన కూతురుందా.. ముంబై మోడల్స్ ఎందుకు ఇక.. వైరల్ ఫిక్స్
ఇది కూడా చదవండి ==> ఈ ముద్దులేంటి.. ఈ హగ్గులేంటి.. ఢీ షోపై నెటిజన్స్ ఫైర్… వీడియో!