Nayanthara : విఘ్నేష్ విషయంలో నయనతార అంత పెద్ద నిర్ణయం తీసుకుందా.. !
Nayanthara : దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్నారు నయనతార. కమర్షియల్ హీరోయిన్‌గా నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ఈ అమ్మడు సత్తా చాటుతుంది. హీరోయిన్స్ లో సుమారు 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది నయనతార అనే చెప్పాలి. ఈ అమ్మడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపిన తర్వాత విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకుంది. జూన్ 9న, తిరుమల శ్రీవారి సన్నిధిలో నయన తార.. తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్నారు. ఇక అక్టోబర్ 9న తమకు కవల పిల్లలు జన్మించారంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంతో ఈ విషయం వివాదంగా మారింది. నయన్ తీరుపై సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా మండిపడ్డారు. ఈ వివాదం పై విచారణ చెప్పట్టింది తమిళనాడు ప్రభుత్వం. పెళ్లైన నాలుగు నెలలకె పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ ఇప్పటికే నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నయన్ విఘ్నేష్ తాము ఎప్పుడో పెళ్లి చేసుకున్నామని డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో ఈ వివాదం సద్దుమణిగినట్టు సమాచారం. అయితే ఇప్పుడు మరో కొత్త వివాదం నయనతార విషయంలో తలెత్తినట్టు టాక్.

Did Nayanthara take such a big decision regarding Vignesh Shivan
Nayanthara : పాపం నయనతార..!
విఘ్నేష్ శివన్ తల్లి సరోగసి ద్వారా పుట్టిన పిల్లలు మా వంశానికి చెందిన వారు కాదని అన్నారట. దీంతో నయనతారకి కోపం వచ్చి గతంలో విగ్నేశ్ పేరిట రాసిన ఆస్తులకి సంబంధించిన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసిందట. అంతేకాదు విగ్నేశ్ కి దూరంగా వేరేగా ఉంటుందట. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి పెళ్లి సమయంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి స్పందించగా, నయన తారకు పెళ్లి అచ్చిరాదని అన్నారు. నయన తార జాతకంలో గురువు నీచంలో ఉన్నారని అందుకనే ఆమె వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే జరుగుతుందా అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.