SS Thaman : మళ్లీ ఎస్ఎస్ తమన్‌నే నమ్ముకుంటున్నారు.. ఇదేంట్రా బాబూ..?

Advertisement

SS Thaman : ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా క్రేజ్‌తో ఉన్నాడు ఎస్ఎస్ థమన్. మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, అనూప్ రుబెన్స్, అనిరుధ్, గోపీసుందర్, హిప్ హప్ తమిళ.. లాంటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా థమన్ కావాలంటున్నారు అందరూ. పాటలతో పాటుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను బాగా లేపుతున్నాడని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. చేతినిండా టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు.అయితే, ఈ మధ్య థమన్‌పై ట్రోల్స్ కూడా బాగానే జరుగుతున్నాయి.

థమన్ సంగీతం అందిస్తున్న హీరోల అభిమానులే పెదవి విరుస్తున్నారు. ఇక గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించగా బ్లాక్ బస్టర్ సాధించిన ‘దూకుడు’ మ్యూజికల్‌గా భారీ హిట్ సాధించింది. ఆ తర్వాత మహేశ్ సినిమాలకు థమన్ సూపర్ హిట్ ఆల్బంస్ ఇచ్చాడు. అయితే, మధ్యలో దాదాపు 8 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవల మహేశ్ నటించిన సర్కారు వారి పాట సినిమాకు సంగీతం అందించాడు థమన్. ముందు నుంచీ భారీ హైప్ క్రియేట్ అయినా ఓవరాల్‌గా మాత్రం మ్యూజిక్ ఏరకంగానూ ఎసెట్ కాలేదనే టాక్ వచ్చింది.దాంతో ఇప్పుడు థమన్‌పై మహేశ్ అభిమానులే అసంతృప్తిగా ఉన్నారట.

Advertisement
Mahesh Babu and Trivikram Srinivas Again SS Thaman Believe
Mahesh Babu and Trivikram Srinivas Again SS Thaman Believe

SS Thaman : ఎట్టిపరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయను..

అందుకే, మహేశ్ కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అనగానే …మళ్ళీ ఆయనే ఎందుకు అంటూ పెదవి విరుస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈసారి ఫ్యాన్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయను అనే విధంగా తన ట్విట్టర్‌లో ఓ పోస్టర్ పెట్టాడు థమన్. దాంతో మళ్ళీ మహేశ్- త్రివిక్రం సినిమాకు థమన్ ఎందుకు..అంటూ నిట్టూర్పుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈసారైనా మంచి మ్యూజిక్ ఇచ్చి అందరినీ శాటిస్‌పై చేస్తాడా లేదా చూడాలి.

Advertisement
Advertisement