Dil Raju : దిల్ రాజు గేమ్ ఛేంజింగ్ స్టెప్.. ప్రభుత్వానికి పరిశ్రమకు బ్రిడ్జ్ గా సూపర్..!
ప్రధానాంశాలు:
Dil Raju : దిల్ రాజు గేమ్ ఛేంజింగ్ స్టెప్.. ప్రభుత్వానికి పరిశ్రమకు బ్రిడ్జ్ గా సూపర్..!
Dil Raju : పుష్ప 2 ప్రీమియర్ షో వివాదంలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న విషయాల గురించి అందరికీ తెలిసిందే. ఐతే ఈ ఇష్యూలో దిల్ రాజు ఇప్పుడు కీలక వ్యక్తిగా మారాడు. ఈమధ్యనే టీ.ఎఫ్.డి.సి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు అల్లు అర్జున్ సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Dil Raju కిమ్స్ లో ట్రీట్ మెంట్..
ఈ క్రమంలో ఆయన అమెరికా నుంచి రాగానే సీఎం ని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత కిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న శ్రీ తేజ్ ని చూసేందుకు హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు దిల్ రాజు.
ప్రభుత్వానికి, పరిశ్రమకు బ్రిడ్జ్ గా తాను ఉంటానని ఇక్కడ ప్రభుత్వం, అల్లు అర్జున్ కాదు రేవతి కుటుంబానికి న్యాయం జరిగేలా బాధ్యత వహిస్తానని అన్నారు. భాస్కర్ కు ఇండస్ట్రీలో పర్మినెంట్ జాబ్ ఇప్పిస్తామని అన్నారు. త్వరలోనే పరిశ్రమ అంతా సీఎం తో మీటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.