Dil Raju : మ‌రోసారి తండ్రి కాబోతున్న దిల్ రాజు.. తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dil Raju : మ‌రోసారి తండ్రి కాబోతున్న దిల్ రాజు.. తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త‌లు

 Authored By sandeep | The Telugu News | Updated on :20 April 2022,3:30 pm

Dil Raju: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాత‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా రాణిస్తున్నాడు. కెరియ‌ర్ ప‌రంగా బాగానే ఉన్నా, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం కొన్ని డిస్ట్ర‌బెన్స్ వ‌చ్చాయి. దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో మరణించారు. ఆతరువాత దాదాపు రెండేళ్లు ఒంటరిగానే ఉన్న రాజు భార్యను తలుచుకుని కుంగిపోయాడు. ఇక మొదటి భార్య శిరీషకు ఒక కూతురు ఉంది. ఆమె పెళ్ళి జరిగి పిల్లలు కూడా ఉన్నారు.ఇక భార్య మరణంతో కుంగిపోయిన తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు తానే దగ్గరుండి రెండో పెళ్లి జరిపించింది.

కరోనా సమయంలోనే కొద్ది మంది బంధువుల సమక్షంలో దిల్ రాజు, వైఘా రెడ్డిపెళ్ళి ఘనంగా జరిగింది. 51 ఏళ్ల వయస్సులో రెండో పెళ్ళి చేసుకున్న దిల్ రాజు… తాజాగా తండ్రి కాబోతున్నాడట. ఇప్పటికే తన కూతురు పిల్లలతో తాతా అనిపించుకుంటన్న దిల్ రాజ్ ఇప్పుడు మరోసారి తండ్రి కాబోతున్నట్టు సమాచారం.దిల్ రాజు రెండో భార్య తేజస్విని ప్రస్తుతం నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తపై దిల్ రాజు కాని ఆయన ఫ్యామిలీ కాని.. టీమ్ కానీ అఫీషియల్ గా ఇంతవరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయలేదు.

dil raju to be father again

dil raju to be father again

Dil Raju : శుభ‌వార్త చెప్ప‌నున్నాడా..

అయినప్పటికీ..ఈ వార్త నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.దిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి, తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి చిత్రం పేరు దిల్. ఈ సినిమాతో ఆయన దిల్ రాజుగా పేరు గాంచాడు. తెలుగులో ప్రముఖ హీరోలందరి సినిమాలను దిల్ రాజు నిర్మించారు, పలు సినిమాలను ఆయన పబ్లిషర్‌ కూడా. 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్‌ పాపులర్‌ మూవీ అవార్డును అందుకున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది