director serious on prabhas
Prabahs : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కటౌట్‌తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఇక అక్కడి నుండి తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నాడు. అయితే బాహుబలి సినిమా కోసం బరువు పెరిగిన ప్రభాస్… ఆ తర్వాత దాదాపుగా అంతే బరువుతో కనిపిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్ సినిమాలో కూడా ప్రభాస్ లుక్‌పై అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఫిజిక్ సమస్యగా మారుతోందని సమాచారం అందుతోంది.
సాహో , రాధేశ్యామ్ సినిమాలలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన సీజీ వర్క్‌కు కూడా భారీ మొత్తం ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. ప్రభాస్ షూటింగ్ చేస్తున్న సినిమాలలో సలార్ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా వరుస షూటింగ్ లతో చిత్ర బృందం బిజీగా ఉంది. అలాగే ప్రభాస్ ఈ చిత్రంతో పాటు ప్రాజెక్ట్ k అన్న పేరుతో ఇంకొక సినిమా కూడా చేస్తున్నాడు. అదేవిధంగా ఆదిపురుష్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి.అయితే ఆ షూటింగ్స్ కోసం ప్రభాస్ అప్పుడప్పుడు ముంబై వెళ్లాల్సి వస్తుంది.
director serious on prabhas
ఇలా బిజీగా ఉండడంతో ప్రభాస్ శరీరాకృతి ఒక్క క్రమ పద్ధతిలో ఉంచుకోవడం చాలా కష్టం అవుతుంది అని తెలిసింది. వరుస షూటింగ్ లతో ప్రభాస్ లుక్ మారిపోతుండడంతో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కొంచెం అసంతృప్తి చెందుతున్నాడు. అందుకే చాలా వరకు యాక్షన్ సీన్లలో ప్రభాస్ కు బదులుగా ఒక డూప్ ను పెట్టి తీసుకున్నట్టు సమాచారం తెలిసింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కన్నా అతని డూప్ నే ఎక్కువగా నమ్ముకున్నాడని అందరూ అంటున్నారు. ప్రస్తుతం డూప్ తో అడ్జస్ట్ అవుతూ సీన్ లను చిత్రీకరిస్తున్నాడట ప్రశాంత్ నీల్. దీనిపై క్లారిటీ రావాలసి ఉంది.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.