Kamal Haasan : కమల్ హాసన్ కు మూడ్ తెప్పించడానికి ఆ డైరెక్టర్ ఏకంగా అదే చేశాడట..!!
Kamal Haasan : కమల్ హాసన్ అంటేనే వెర్సటైల్ యాక్టర్. కమల్ హాసన్ ఇప్పుడు కాదు.. దాదాపు 5 దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సౌత్ కే ఆయన పెద్ద స్టార్. ఆరు పదుల వయసు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కమల్ హాసన్. ఇటీవల ఆయన నటించిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే కదా. అయితే.. కమల్ హాసన్ కు మంచి పేరు వచ్చింది మాత్రం కళాతపస్వి విశ్వనాథ్ డైరెక్షన్ లో నటించిన సినిమాలతోనే.
ఒక స్వాతిముత్యం సినిమాను తీసుకుంటే.. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కమల్ హాసన్, రాధిక.. ఇద్దరూ నటించలేదు. తమ పాత్రల్లో జీవించారు. అందుకే వాళ్ల కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో అమాయకుడి పాత్రలో కమల్ హాసన్ నటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆ సినిమాలో రాధిక, కమల్ మధ్య నాచురల్ గా కొంత మేరకు రొమాన్స్ ఉంటుంది. ఆ సినిమాలో ఇద్దరి మధ్య నాచురల్ రొమాన్స్ ను క్రియేట్ చేయడానికి విశ్వనాథ్ చాలా కష్టపడ్డారట.
Kamal Haasan : ఆ సినిమాలో కమల్ హాసన్ ను రొమాన్స్ చేయించేందుకు చాలా కష్టపడ్డ విశ్వనాథ్
రాధిక రొమాన్స్ విషయంలో ఓకే కానీ.. కమల్ హాసన్ మాత్రం రొమాన్స్ సీన్లలో చాలా సిగ్గుపడ్డారట. దీంతో తప్పని పరిస్థితుల్లో రాధికను పిలిచిన విశ్వనాథ్ తన చీర మీద ఒక రొమాంటిక్ స్ప్రేను చేశారట. అలా అయినా కమల్ హాసన్ కు మూడ్ వస్తుందని కళాతపస్వి అనుకున్నారట. కానీ.. కమల్ హాసన్ మాత్రం కావాలని రాధికే ఆ స్ప్రే కొట్టుకుందని అపార్థం చేసుకున్నారట. తర్వాత అసలు విషయం తెలుసుకొని విశ్వనాథ్ కు దండం పెట్టారట.