Divi Vadthya : అందాలతో అదరగొట్టిన దివి.. ఐటెం సాంగ్‌తో రచ్చ
Divi Vadthya : బిగ్ బాస్ షోతో దివి అనే అద్భుతమైన అందం అందరికీ పరిచయమైంది. బిగ్ బాస్ షోలోకి రాకముందు అసలు దివి అనే నటి ఉందనే విషయమే ఎవ్వరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ప్రారంభంలో దివి అనే అమ్మాయి ఉందా? అసలు ఆమె ఎవరు? అనే జోకులు కూడా పేలాయి. సోషల్ మీడియాలో ఆమెపై సెటైర్లు కూడా బాగానే పడ్డాయి. కానీ దివికి ఓవర్ నైట్ స్టార్డం వచ్చేసింది. ఒక్క ఎపిసోడ్‌తోనే దివి దశ మారింది. కంటెస్టెంట్ల గురించి నిజాలు చెబుతూ మార్నింగ్ మస్తీలో రచ్చ చేసింది.

Bigg boss fame Divi Promo Form Cab stories
బిగ్ బాస్ షోలో దివి అందాలు అందరినీ కనువిందు చేశాయి. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే దివి నడుము, నాభి అందాలు అందరినీ కట్టిపడేశాయి. ఫినాలే ఎపిసోడ్ నాడు చిరు,నాగ్ కూడా దివి అందాలపై సెటైర్లు వేశారంటే ఆమె స్థాయి ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే దివి ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ దివి నటిస్తోంది. చిరు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో దివి ముఖ్య పాత్రలో నటిస్తోంది.
Divi Vadthya : అందాలతో అదరగొట్టిన దివి..
అయితే తాజాగా దివి నటిస్తోన్న ఓ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది. క్యాబ్ స్టోరీస్ వాల్యూమ్ 1 అంటూ రాబోతోన్న దాంట్లో దివి తన అందాలను బాగానే ప్రదర్శించింది. ఐటెం సాంగ్‌లో దివి రెచ్చిపోయినట్టుంది. చూపులతోనే మత్తెక్కించేలా దివి రెచ్చగొడుతోంది. మొత్తానికి దివి మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఆఫర్ల మీద ఆఫర్లు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. అయితే అసలైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
