Bigg Boss 5 Telugu Sarayu: బిగ్ బాస్ 5 తెలుగు ఫేమ్ సరయు ఎలా పాపులర్ అయిందో మీకు తెలుసా..?
Bigg Boss 5 Telugu Sarayu: సోషల్ మీడియా వచ్చాక హిడెన్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతో మంది బయట ప్రపంచానికి తమని తాము కొత్తగా పరిచయం
చేసుకుంటున్నారు. తమలోని టాలెంట్ చూపించుకోవాలంటే ఒకప్పుడు నానా అవస్థలు పడవలిసి వచ్చేది. సినిమాలలో, సీరియల్స్‌లో అవకాశాలు దక్కించుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చేది. హెవీ కాంపిటీషన్ మధ్య అవకాశం దక్కుతుందా లేదా కూడా నమ్మకాలు తక్కువ. ఇలాంటి సమయంలోనే తమని తాము నిరూపించుకునేందుకు డిజిటల్ మీడియా రంగం వచ్చింది.

do-you-know-bigg-boss-5-telugu-sarayu-how-she-became-popular
ఎవరికి వారు సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మొబైల్‌లోనే తమలోని టాలెంట్‌ను షూట్ చేసి వారి యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసుకుంటున్నారు. అవి నచ్చినవాళ్ళు లైక్ చేయడం, కామెంట్ చేయడం షేర్ చేయడం ద్వారా బాగా పాపులర్ అయి యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకొని షార్ట్ ఫిలింస్‌లో, జబర్దస్త్ లాంటి కామెడి షోస్‌లో, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అంతేకాదు బిగ్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లాంటి షోస్‌లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
Bigg Boss 5 Telugu Sarayu: 7ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో తన వీడియోలకి బాగా ఫాలోయింగ్ ఉంది.
అలా అవకాశం సంపాదించుకున్న ఆమెనే సరియు. ఈమె 7ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో తన వీడియోలకి బాగా ఫాలోయింగ్ ఉంది. వాటి ద్వారానే ఫేమస్ అయి
ఇప్పుడు బిగ్ బాస్‌లో అవకాశం దక్కించుకుంది. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో సెన్సార్ కట్స్ లేని బూతులు మాట్లాడుతూ, కుర్రాళ్లలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్
సంపాదించుకుంది. అలాగే అందాలను ఆరబోయడంలోనూ సరయు సంథింగ్ స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిచింది. ఇప్పుడు బిగ్ బాస్‌లో హౌజ్ లోనూ ఇదే చేస్తుంది సరియు.