Unstoppable : బాలయ్య అన్‌స్టాపబుల్‌లో తర్వాత వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా..? పొట్ట చెక్కలవ్వాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Unstoppable : బాలయ్య అన్‌స్టాపబుల్‌లో తర్వాత వచ్చే గెస్ట్ ఎవరో తెలుసా..? పొట్ట చెక్కలవ్వాల్సిందే!

 Authored By mallesh | The Telugu News | Updated on :30 November 2021,8:20 pm

Unstoppable : నంద‌మూరి నట సింహం బాల‌కృష్ణ ఓ వైపు హీరోగానే కాకుండా మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫాంలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాంనకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతోనే కాకుండా ఈ సెలెబ్రిటీల షో ద్వారా నందమూరి ఫ్యాన్స్‌కు కిక్కు మీద కిక్కు ఇస్తున్నారు. ఓన్లీ ‘ఆహా’ స్ట్రీమింగ్‌లో వచ్చే ఈ షో ప్రేక్షకుల నుంచి మంది ఆదరణను పొందినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకనిర్మాతలను సీనియర్, జూనియర్ అనే తేడా అందరినీ బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేయనున్నారు. తనదైన పంచులతో వారి ఉర్రూత లూగిస్తున్నారు.

ఈ ప్రోగ్రాంలో ఇప్పటికే సీనియర్ నటులు మోహన్ బాబు ఆయన కూతురు వచ్చి సందడి సందడి చేశారు. సెకండ్ ఎపిసోడ్‌లో యాక్టర్ నేచురల్ స్టార్ నాని హాజరవ్వగా బాలయ్య బాబు తన పంచులతో నానిని ఓ ఆటాడుకున్నాడు.అయితే, ఈ మధ్య అఖండ షూటింగ్‌లో భాగంగా బాలకృష్ణ చేతికి చిన్న గాయం అయ్యింది. చికిత్స అనంతరం ఆయన ఫిట్ అయ్యారు. ప్రస్తుతం బాలయ్య బాబు మరో ఎపిసోడ్ షూట్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆహా టీం ప్రకటించింది.

do you know who is the next guest in balayya unstoppable

do you know who is the next guest in balayya unstoppable

Unstoppable : నవ్వుల రారాజు, హస్య బ్రహ్మ ఎంట్రీ..

బాలయ్య బాబు కోలుకున్నాక తీస్తున్న ఎపిసోడ్ అదిరిపోయి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఆహా బృందం ఆలోచన చేసిందట.. షో భారీ హిట్ అయ్యేందుకు హాస్య బ్రహ్మ బ్రహ్మనందంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడిని కూడా తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు వారు కూడా ఓకే చెప్పారట.. ఈ షో టెలికాస్ట్ అవ్వడమే తరువాయి. ఎన్ని వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక బాలయ్య బాబు నటించిన‘అఖండ’ మూవీ డిసెంబ‌ర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా, బోయపాటి, బాలయ్య బాబు కాంబోలో హ్యాట్రిక్ హిట్ పడుతుందా లేదా వేచిచూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది