Viral Video : ఐకియాలో షాపింగ్ కు వచ్చి కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే… వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఐకియాలో షాపింగ్ కు వచ్చి కుప్పకూలిపోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే… వీడియో

Viral Video : హార్ట్ ఎటాక్ లేదా గుండె పోటు.. అసలు ఇది ఎప్పుడు ఏ వయసు వాళ్లు ఎందుకు వస్తుందో ఆ దేవుడికి కూడా తెలియదు. యుక్త వయసులో ఉన్నవాళ్లకు కూడా అప్పుడప్పుడు గుండె పోటు వస్తుంటుంది. వృద్ధులకు కూడా గుండె పోటు వస్తుంటుంది. అసలు ఏ వయసు వారు అయినా సరే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే.. వాళ్లకు గుండె పోటు అనేది ఎప్పుడైనా రావచ్చు. అందుకే.. ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 January 2023,12:00 pm

Viral Video : హార్ట్ ఎటాక్ లేదా గుండె పోటు.. అసలు ఇది ఎప్పుడు ఏ వయసు వాళ్లు ఎందుకు వస్తుందో ఆ దేవుడికి కూడా తెలియదు. యుక్త వయసులో ఉన్నవాళ్లకు కూడా అప్పుడప్పుడు గుండె పోటు వస్తుంటుంది. వృద్ధులకు కూడా గుండె పోటు వస్తుంటుంది. అసలు ఏ వయసు వారు అయినా సరే ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే.. వాళ్లకు గుండె పోటు అనేది ఎప్పుడైనా రావచ్చు. అందుకే.. ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఏ వయసు వారు అయినా సరే.. గుండె పోటు నుంచి బయటపడొచ్చు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి బెంగళూరులోని ఐకియా స్టోర్ లో చోటు చేసుకుంది.

ఐకియా మాల్ లోకి ఓ వ్యక్తి వచ్చాడు. షాపింగ్ చేస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న వాళ్లకు ఏం అర్థం కాలేదు. అతడికి ఏమైందో అని అందరూ టెన్షన్ పడ్డారు. ఇంతలో అక్కడే షాపింగ్ చేస్తున్న ఓ డాక్టర్ వెళ్లి అతడికి ఏమైందో అని చెక్ చేశాడు. హార్ట్ ఎటాక్ వచ్చిందని గ్రహించి వెంటనే సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. అలా 10 నిమిషాల పాటు అలాగే సీపీఆర్ చేయడంతో అతడికి తిరిగి స్పృహ వచ్చింది. సమయానికి దేవుడిలా ఆ డాక్టర్ అక్కడే ఉన్నాడు కాబట్టి సీపీఆర్ చేయడంతో ఆ వ్యక్తి తిరిగి బతకగలిగాడు.

Viral Video on doctor does cpr to a man who collapsed in ikea with heart attack

Viral Video on doctor does cpr to a man who collapsed in ikea with heart attack

Viral Video : సోషల్ మీడియాలో వీడియో వైరల్

అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఆ డాక్టర్ కొడుకు ట్విట్టర్ ఖాతాలో పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పాడు. నిజంగా డాక్టర్ ఎక్కుడున్నా దేవుడే. అందుకే డాక్టర్ ను మనం దేవుడిలా కొలుస్తాం.. ఒక మనిషి ప్రాణం కాపాడాడు. హేట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆ డాక్టర్ కు చేతులెత్తి దండం పెడుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది