Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో అతి తక్కువ పారితోషికం ఎవరికో తెలుసా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో అతి తక్కువ పారితోషికం ఎవరికో తెలుసా!

Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో మొదటి రోజే ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. 21 మంది లో కొందరు తెలిసిన వాళ్ళు కాగా, మరి కొందరు అస్సలు తెలియని వారు, ఇంకొందరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించిన వారు. మెజార్టీ మెంబర్స్ మాత్రం ప్రేక్షకులకు పెద్దగా తెలియని వాళ్లే అంటూ ఇప్పటికే చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 September 2022,9:00 pm

Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. ఈ కార్యక్రమం లో మొదటి రోజే ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. 21 మంది లో కొందరు తెలిసిన వాళ్ళు కాగా, మరి కొందరు అస్సలు తెలియని వారు, ఇంకొందరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించిన వారు. మెజార్టీ మెంబర్స్ మాత్రం ప్రేక్షకులకు పెద్దగా తెలియని వాళ్లే అంటూ ఇప్పటికే చర్చ మొదలైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి పారితోషకం ఒక మోస్తరు గానే ఉంటుంది. కారణం ఇప్పటికే కార్యక్రమం నిర్వహణకు భారీ ఎత్తున ఖర్చు అవడం మరియు రేటింగ్ వీక్ డేస్ లో తక్కువ ఉండడం వంటి కారణంగా కంటెస్టెంట్స్ కి తక్కువ పారితోషకం ఇస్తూ వారితో ఎంటర్టైర్మెంట్ అందించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈసారి కాస్త తక్కువ పారితోషికాలనే ఎక్కువ మందికి ఇస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మాకు అందని సమాచారం ప్రకారం ఈ సీజన్లో అతి తక్కువ భారీతోషికం తీసుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు అంటే అది ఆది రెడ్డి. అవును ఆయన యూట్యూబ్, గతంలో బిగ్ బాస్ కార్యక్రమానికి ఆయన యూట్యూబ్ ద్వారా రివ్యూలు ఇచ్చేవాడు. ఆయన కు సామాన్యుల కోట ద్వారా బిగ్ బాస్ లో ఎంట్రీ దక్కింది. ఆయన బిగ్ బాస్ పై ఉన్న ఫ్యాషన్ తో కనీసం పారితోషికం కూడా అక్కర్లేదు అనేసాడట. కానీ నిర్వాహకులు మాత్రం ఆయనకు నామమాత్రపు పారితోషకములు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు అని మాకు సమాచారం అందుతోంది.

Does anyone know the lowest salary in Bigg Boss 6 Telugu

Does anyone know the lowest salary in Bigg Boss 6 Telugu

వారానికి రెండున్నర లక్షల రూపాయలు ఆయనకు పారితోషికంగా ఇస్తున్నారట. అందులో కట్టింగులు పోను ఆయనకు అందేది 1.75 లక్షల రూపాయలు మాత్రమే. ఆయన గతంలో బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం ద్వారా ఇంతకు ఎక్కువగానే సంపాదించేవాడట. అయినా కూడా బిగ్బాస్ పై ఉన్న ఇష్టం తో మరియు సెలబ్రిటీ హోదా వస్తుంది అనే ఉద్దేశంతో ఆదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓకే చెప్పాడు అని సమాచారం అందుతుంది. ఆయన ఎన్ని వారాలు ఉంటాడు అనేది ఇప్పుడే చర్చ మొదలైంది. మొదటి ఎపిసోడ్ లోనే సెంటిమెంట్ డ్రామాని పండించేందుకు ఆయన ప్రయత్నించాడు అని… నటరాజ్ మాస్టర్ లేని లోటును ఆయన తీర్చబోతున్నాడా అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి యూట్యూబర్ ఆది రెడ్డి బిగ్ బాస్ లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడా, లేదంటే వెంటనే బయటికి వచ్చేసి మళ్ళీ రివ్యూలు చెప్పుకుంటాడా అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది