Jabardasth Varsha : నీ ఒరిజినల్ ఇదే.. వర్ష పరువుతీసిన ఇమాన్యుయేల్
Jabardasth Varsha : వర్ష ఇమాన్యుయేల్ ట్రాక్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌కు కలర్ ఫోటో జోడి అని కూడా పెట్టేశారు. ఆ ఇద్దరూ కూడా తమ తమ స్కిట్లు, డైలాగ్స్‌లతో బాగానే రక్తి కట్టించారు. కాస్త అతి కూడా చేసేశారు మధ్యలో. మొత్తానికి వర్ష ఇమాన్యుయేల్ మాత్రం నిజమైన ప్రేమికుల్లా తెరపై బాగానే నటించారు. అయితే మధ్యలో ఈ ఇద్దరూ చేసిన అతి, మల్లెమాల అత్యుత్సాహంతో ట్రాక్ గాడి తప్పింది.వర్ష ఇమాన్యుయేల్ ఎంగేజ్మెంట్, పెళ్లి అంటూ మధ్యలో ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ కోసం వర్ష కూడా కాస్త అతిగానే నటించేసింది.
తన సోషల్ మీడియా ఖాతాల్లో రింగ్ ఫోటోను పెట్టేయడం, ఎంగేజ్మెంట్ అయినట్టుగా ప్రకటించడం అప్పట్లో తెగ వైరల్ అయింది. తీరా చూస్తే అది ఓ ఈవెంట్ కోసం. అందులో వర్ష, ఇమాన్యుయేల్ ఎంగేజ్మెంట్ అంటూ స్కిట్ వేశారు. మొత్తానికి అలా ఈ ఇద్దరూ తెరపై బాగానే నడిపిస్తున్నారు.మొన్నటికి మొన్న వర్ష ఇమాన్యుయేల్ మధ్య గొడవైనట్టుగా ఓ ప్రోమోను వదిలి.. ఈవెంట్‌ను చేశారు. వర్షను మొగోడు.. లేడీ గెటప్పు అని ఏడిపిస్తుంటాడు ఇమాన్యుయేల్. ఆమె వాయిస్‌ను కూడా ఆట పట్టిస్తుంటాడు ఇమాన్యుయేల్.
ఆది, రాం ప్రసాద్, భాస్కర్ ఇలా అందరూ కూడా ఆమె మీద స్కిట్లో భాగంగా సెటైర్లు వేస్తుంటారు. అయితే ఆ ఈవెంట్‌లో మాత్రం వర్ష కాస్త సీరియస్ అయినట్టుగా నటించేసింది.తాజాగా వదిలిన ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమోలో ఈ ఇద్దరూ బుల్లెట్ భాస్కర్ టీంలో కనిపించారు. పైలెట్‌గా ఇమాన్యుయేల్ ఉంటే.. వర్ష ప్రయాణికురాలిగా వచ్చింది. ఫారెన్‌కు వెళ్లే దానిలా రెడీ అయి వచ్చింది. వింత గెటప్పులో ఉన్న వర్షపై ఇమాన్యుయేల్ కౌంటర్ వేశాడు. నీ ఒరిజినల్ ఇదే.. ఇలానే ఉంటావ్ అంటూ వర్ష పరువుతీసేశాడు ఇమాన్యుయేల్. ఇక ఆమె మాట్లాడే యాస మీద కూడా సెటైర్లు వేశాడు.