Ester Noronha : పాత్రల కోసం పడుకుంటామని అడుగుతారు.. నోయల్ మాజీ భార్య షాకింగ్ కామెంట్స్
Ester Noronha : ర్యాప్ సింగర్ నోయల్ మాజీ భార్య, హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. #69 సంస్కార్ కాలనీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూలలో ఎస్తేర్ చేసే కామెంట్స్ సెన్సేషనల్‌గా మారుతున్నాయి. మొదట్లో తెలుగులో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుని కన్నడ హీరోయిన్‌గా ఫేమస్ అయ్యింది ఎస్తేర్. ప్రముఖ ర్యాప్ సింగర్ నోయల్‌ని పెళ్లి చేసుకున్న కొన్ని నెలల వ్యవధిలోనే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంది ఎస్తేర్. భీమవరం బుల్లోడు, వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో కనిపించినా ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు మన తెలుగు దర్శకులు.
అయితే టాలెంట్ ఉన్నప్పటికీ తనకి ఆఫర్లు రాకపోవడానికి కారణం.. క్యాస్టింగ్ కౌచ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఎస్తేర్. ఆఫర్లకి లొంగిన హీరోయిన్ల బాగోతాన్ని కూడా బయటపెడుతూ తెరచాటు వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. ఇండస్ట్రీలో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా కనిపించాయి.. సినిమా ఆఫర్లతో పాటు ఈ ఆఫర్లు కూడా వచ్చేవి.. వాళ్లని ఇంప్రెస్ చేయమని వీళ్లని ఇంప్రెస్ చేయమని అనేవాళ్లు.. వాడిపని వాడు చేసుకుని పోతుంటే.. పిలిచి మరీ ఆ ఆఫర్లు ఇచ్చేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్లను కూడా నేను చూశాను.గర్ల్స్ కూడా ఓపెన్‌గా ఆఫర్లు ఇస్తాను.. నా కెరియర్ కోసం నేను ఏం ఇవ్వమన్నా ఇస్తానని ఓపెన్‌గా చెప్తారు. మగాళ్లు అడగటం ఒకటైతే ఆడాళ్లు ఆఫర్ చేయడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది. నేను అలా కాదు.. నాకు నచ్చిందే చేస్తాను.. నేను స్టుపిడ్‌ని కాదు.. ప్రపంచంలో బోలెడు ఇండస్ట్రీలు ఉన్నాయి.
నాకు రాసిపెట్టి ఉంటే ఎక్కడైనా చేస్తా.. తెలుగులోనే చేయాలని లేదు కదా.. వెళ్లాలని ఉంటే ఆపలేరు. రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో లేదో తెలియదు.. వీళ్లు మనల్ని ఎప్పుడో లేపుతాం అంటే నమ్మకం ఎలా కుదురుతుంది.ఇండస్ట్రీలో అవకాశాల కోసం పడకసుఖం అనేది.. రన్నింగ్ థింగ్.. నచ్చిన వాళ్లు చేస్తున్నారు కాబట్టి.. అది నాకు నచ్చలేదని చెప్పొచ్చు కానీ.. మీరు చేయొద్దని నేను చెప్పలేను. నేను నో చెప్పిన తరువాత నన్ను ఇబ్బందులు పెట్టిన సందర్బాలు లేవు కానీ.. ఆవిడ చేయరు.. నంబర్ అడిగితే ఇవ్వరు.. తెలుగులో ఇంట్రస్ట్ చూపించదు.. యాటిట్యూడ్ అని ఏవేవో చెప్తారు. రీసెంట్‌గా కూడా నన్ను బ్యాడ్ చూపించాలని చాలా చేశారు. కానీ మంచితనం ఎప్పటికైనా కాపాడుతుంది. అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నా అని చెప్పుకొచ్చింది ఎస్తేర్.