Dhee 14 : ఢీ 14.. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ టార్చర్
Dhee 14 : ఈటీవీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఢీ డాన్స్ షో ఈ మధ్య కాలంలో గతి తప్పింది. సీజన్ 14 పూర్తిగా ప్రేక్షకులను నిరాశ పరిచింది అనడంలో సందేహం లేదు. పెద్దఎత్తున అంచనాల నడుమ ప్రారంభమైన సీజన్ 14 తీవ్రంగా అసంతృప్తి కలగజేస్తుంది. అందుకు కారణం సుదీర్ లేకపోవడం. గత సీజన్లో సుదీర్ చేసిన కామెడీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ తర్వాత సుధీర్ ఆ స్థాయిలో ఢీ డాన్స్ కార్యక్రమంలో సందడి చేశాడు. ఆది మరియు సుధీర్ కామెడీ చాలా మందికి నచ్చింది. వారితో కలిసి ప్రదీప్ చేసే కామెడీ అంతకు మించి అన్నట్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం మొత్తం పరిస్థితి తారుమారైంది.
సీజన్ 14 లో కామెడీ పేరుతో డబల్ మీనింగ్ డైలాగులు.. ఒకళ్ళని ఒకళ్ళు తగ్గించుకుంటూ చెప్పే డైలాగులు తప్ప మరేం కనిపించడం లేదు. హైపర్ ఆది ఒక్కడు నవ్వించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నా ఇతర నుండి సహకారం అందడం లేదు. నవ్వు తెప్పించక పోగా వాళ్ళు చేస్తున్న కామెడీ స్కిట్ లు తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టార్చర్ ఇంకెన్నాళ్లు అన్నట్లుగా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సీజన్ ముగింపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సీజన్లో అయినా సుధీర్ లేదంటే మరొక ఆసక్తికరమైన జోడి కనిపిస్తాయేమో అని ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో మల్లెమాల వారి నుండి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. సీజన్ 14 పూర్తి అయితే పదిహేనవ సీజన్లో సుధీర్ ని తీసుకుని రావాల్సిందే అంటూ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. కాని మల్లెమాల వారి నుండి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు.
కానీ సీజన్ 15 కచ్చితంగా విభిన్నంగా ఉంటుందని నమ్మకం వ్యక్తం అవుతోంది. సీజన్ 15 ఎప్పుడు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మల్లెమాల వారి నుండి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ గా ఎదురు చూస్తున్నారు. గత అయిదు.. ఆరు సంవత్సరాలుగా మంచి సక్సెస్ను సాధించిన డ్యాన్స్ కార్యక్రమం నీరు కార్చడం తో మల్లెమాల వారిపై ప్రేక్షకులు నిప్పులు చూపిస్తున్నారు. సుధీర్ ని తీసుకొని ఉంటే కొనసాగించి ఉంటే ఖచ్చితంగా గత చిత్రాల మాదిరిగానే ఈ సీజన్లో కూడా సూపర్ హిట్ అయ్యేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సుదీర్ ని మరియు రష్మీ ని తీసుకు రావాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈటీవీలో జబర్దస్త్ తర్వాత ఎక్కువ రేటింగ్ దక్కించుకునే కార్యక్రమం ఉంటుంది. కానీ ఇప్పుడు అదే దారుణమైన పరిస్థితి చేరడంతో ఈటీవీ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.