Dhee Dance Show : ‘ఢీ’ కి ఒక పర్మినెంట్‌ జడ్జ్‌ ఎక్కడా? ఇదెక్కడి కక్కుర్తిరా బాబు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dhee Dance Show : ‘ఢీ’ కి ఒక పర్మినెంట్‌ జడ్జ్‌ ఎక్కడా? ఇదెక్కడి కక్కుర్తిరా బాబు!

Dhee Dance Show : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. సౌత్‌ ఇండియాలోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా ఢీ డాన్స్ షో కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక డాన్స్ షో ఇన్ని సీజన్‌ లు గా కొనసాగడం ఒక రికార్డు అయితే.. ఇండియాలో ఇప్పటి వరకు ఏ డాన్స్ షో దక్కించుకోని గొప్ప రేటింగ్‌ లను రికార్డులను కూడా ఢీ డాన్స్ షో దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాండి ఢీ డాన్స్ షో ఇప్పుడు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :29 May 2022,7:00 am

Dhee Dance Show : తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. సౌత్‌ ఇండియాలోనే కాకుండా మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా ఢీ డాన్స్ షో కు ప్రత్యేక స్థానం ఉంది. ఒక డాన్స్ షో ఇన్ని సీజన్‌ లు గా కొనసాగడం ఒక రికార్డు అయితే.. ఇండియాలో ఇప్పటి వరకు ఏ డాన్స్ షో దక్కించుకోని గొప్ప రేటింగ్‌ లను రికార్డులను కూడా ఢీ డాన్స్ షో దక్కించుకున్న విషయం తెల్సిందే. అలాండి ఢీ డాన్స్ షో ఇప్పుడు పర్మినెంట్‌ జడ్జ్‌ లేని షో గా మారింది.గత సీజన్‌ వరకు అంతా బాగానే ఉంది. అంతకు ముందు శేఖర్‌ మాస్టర్‌ బ్యాక్‌ టు బ్యాక్ సీజన్ లకు హోస్టింగ్‌ చేసి మెప్పించాడు.ఆయన సినిమాలతో బిజీ అవ్వడం..

స్టార్‌ మా లో జాయిన్ అవ్వడం వంటి కారణాల వల్ల పూర్తిగా ఢీ షో కు దూరం అయ్యాడు. ఆయన స్థానంలో గణేష్ మాస్టర్‌ వచ్చాడు. ఆయన కూడా రెగ్యులర్‌ గా ఉండటం లేదు. జానీ మాస్టర్ ను గెస్ట్‌ జడ్జ్‌ గా తీసుకు వస్తున్నారు.మొత్తానికి ఢీ కి ఒక పర్మినెంట్‌ జడ్జ్‌ లేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రియమణి కంటిన్యూ అవుతున్నా కూడా మరో లేడీ జడ్జ్‌ విషయంలో కూడా విమర్శలు వస్తున్నాయి. డాన్స్ గురించి పెద్దగా అవగాహణ కూడా లేని నందిత శ్వేత ను అక్కడ కూర్చోబెట్టడం వంటి కారణంగా విమర్శలు వస్తున్నాయి.

etv Dhee Dance Show judge issue trolls on mallemaala

etv Dhee Dance Show judge issue trolls on mallemaala

ఆమద్య ఆది లేకపోవడంతో షో లో ఎంటర్‌ టైన్మెంట్‌ మిస్‌ అయ్యింది. కాని మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల మంచి రేటింగ్‌ వస్తుందని భావిస్తుంటే.. ఇప్పుడేమో జడ్జ్‌ ల వ్యవహారం కాస్త అటు ఇటుగా మారింది. మొత్తానికి ఢీ డాన్స్ షో నిర్వాహకులు భారీ పారితోషికాలు ఇవ్వాల్సి వస్తుందని జడ్జ్‌ ల విషయంలో కంటెస్టెంట్స్ విషయంలో కక్కుర్తి పడుతున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది